More

    ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టుల డబుల్ గేమ్

    దేశంలో జమ్మూకశ్మీర్ తర్వాత ముస్లింలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అసోం, బెంగాల్,  కేరళ..! ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలతోపాటు పాండిచ్చేరి, తమిళనాడులో సైతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2011నాటి జనాభా లెక్కల ప్రకారం అసోంలో ముస్లిం జనాభా 34 శాతంగా నమోదు అయ్యింది. దాదాపు 9 జిల్లాల్లో ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. అలాగే బెంగాల్ లో కూడా ముస్లింల జనాభా 27 శాతంగా నమోదు అయ్యింది. అయితే కొంతమంది మాత్రం ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా 30 శాతానికి పైగానేనని చెబుతుంటారు. బెంగాల్ లో దాదాపుగా రెండు కోట్ల యాభై లక్షల మంది వరకు ముస్లింలు ఉంటారని సెన్సెస్ లెక్కలు చెబుతున్నాయి.

    ఇక కేరళ రాష్ట్రంలో కూడా ముస్లిం జనాభా 27 శాతంగా ఉంది. మొత్తం రాష్ట్ర జనాభాలో 3.3 కోట్లు ఉండగా.. అందులో ముస్లిం జనాభా 88 లక్షల వరకు ఉంటుందని కొన్ని గణంకాలు చెబుతున్నాయి.

    ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు సంబంధించినంత వరకు మూడు పార్టీలు యాక్టివ్ గానే ఉన్నాయి. కేరళల కేవలం ముస్లింల కోసమే పనిచేసే పార్టీగా  ముస్లింలీగ్ పార్టీ ఉండేది. అయితే ఇప్పుడు SDPI పై కూడా తెరపైకి వచ్చింది. ఇంకా చిన్న చితక ముస్లిం పార్టీలు కూడా ఉన్నాయి. ఈ పార్టీలకు లెఫ్ట్ పార్టీలతోపాటు, కాంగ్రెస్ తోనూ దోస్తానా ఉంది. తమ అవసరాలను బట్టీ ఇవి దోస్తానాను కూడా ఛేంజ్ చేస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ముస్లింలీగ్ తో పొత్తు పెట్టుకుంది.

    ఇక అసోం విషయానికి వస్తే… అక్కడ కూడా కాంగ్రెస్… ముస్లిం మతోన్మాద పార్టీగా పేరుగాంచిన ఏఐయూడీఎఫ్ పార్టీతో కలిసి కూటమి కట్టింది. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే అక్రమవలసదారులకు అండగా నిలిచే పార్టీగా దీనికి పేరుంది..! ఆ పార్టీకి బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇంకా ఈ కూటమిలో బీపీఎఫ్‌, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), అంచాలిక్‌ గణ్‌ మోర్చా పార్టీలు ఉన్నాయి.

    కేరళలో ఎలగైతే… ఇండియన్ ముస్లింలీగ్ తో  స్నేహం చేస్తూనే…అక్కడ కమ్యూనిస్టులతో కయ్యాం నెరపుతూ తనదైన అవకాశవాద రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ నడుపుతోంది.

    అయితే అసోంలో కాంగ్రెస్.. ముస్లిం మతవాద పార్టీగా పేరున్న ఏఐయూడీఎఫ్ తో కలిసి పోటీ చేస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ కూటమిలో కమ్యూనిస్టులు ఉండటం కొసమెరుపు.

    కేరళ, అసోంలో వలే..బెంగాల్ లో కూడా మరో ముస్లిం నేత అబ్బాస్ సిద్ధిఖీ ఏర్పాటు చేసిన ఐఎస్ఎఫ్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కూటమి కట్టింది. అబ్బాస్ సిద్ధిఖీకి కరుడుగట్టిన ముస్లిం మతవాదిగా పేరుంది. బెంగాల్ లో కాంగ్రెస్  కూటమిలో కూడా కొసమెరుపు ఏమిటంటే… ఇందులో సైతం కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. కాంగ్రెస్ తోపాటు, మతోన్మాద నేత అబ్బాస్ సిద్ధిఖీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు.

    అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే…, ఇదే కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. కేరళలో మాత్రం అధికారం కోసం ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.  ఒక రాష్ట్రంలో దోస్తీ, మరోక రాష్ట్రంలో కుస్తీ పడుతూ పొలిటికల్ డ్రామాను రక్తికట్టిస్తున్నారు.

    ఎప్పుడూ ఇతరులకు సుద్దూలు చెప్పడంలో ముందుండే ఉండే కమ్యూనిస్టులు…ఏక కాలంలో కాంగ్రెస్ తో దోస్తానాతోపాటు దుష్మానీని సైతం నిభాయిస్తున్నారనే విషయం ఎవరైనా జర్నలిస్టులు ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా?

    మా ఉమ్మడి శత్రువు అయిన బీజేపీని ఓడించడం కోసం బెంగాల్, అసోం, తమిళనాడు, పాండిచ్చెరిలో ఒకటయ్యామని చెబుతున్నారు. మరి కేరళ సంగతి ఏంటని ప్రశ్నిస్తే… ఆ రాష్ట్రంలో మా శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నేతలు గతిలేని తార్కికవాదాన్ని ముందు పెడుతున్నారు.!  

    ఇక…ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ… అబ్బాస్ సిద్ధిఖీతో కలిసి బెంగాల్ ఎన్నికల బరిలోకి దిగాలని మొదట భావించారు. అబ్బాస్ సిద్ధిఖీతో రహస్య మంతనాలు జరిపారు. అయితే అబ్బాస్ సిద్ధిఖీ ఒవైసీతో కలవకుండా… కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి కూటమి కట్టారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా 42 మంది ముస్లింలకు పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. దాదాపు 70 నుంచి 100 నియోజకవర్గాల్లో ముస్లింల ప్రభావం ఉంటుందని, ఈ నియోజకవర్గాల్లో పార్టీల గెలుపు ఓటములను వీరు ప్రభావితం చేస్తారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

    అయితే అసదుద్దీన్ ఒవైసీ… మార్చి ఏడో తేదీన.. బెంగాల్ లో తమ పార్టీ నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని మొదట భావించారు. అయితే పోలీసులు ఆయన సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పర్యటనను రద్దు చేసుకుని తమిళనాడులో పర్యటించారు. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మా మక్కల్ మున్నేట్ర-ఏఎంఎంకే తో కూటమి కట్టారు.

    బెంగాల్ లో ఫస్ట్ ఫేస్ లో పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో సైతం అభ్యర్థులను ప్రకటించలేదు ఒవైసీ! అయితే తాజాగా మార్చి 27న బెంగాల్ లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఒవైసీ ప్రకటించారు. బెంగాల్ లో మిగిలిన దశల్లో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

    ఇటు తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ.., డీఎంకేతో కలిసి పోటీ చేస్తోంది. ఈ కూటమిలో కూడా కమ్యూనిస్టులతోపాటు, ఇండియన్ ముస్లిం లీగ్, అలాగే మరోక ముస్లిం పార్టీ ఎంఎంకే ఉంది.

    మొత్తంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అలాగే ముస్లిం మతవాద పార్టీలందరికీ కూడా ముస్లింల ఓట్లు కావాలి.! అందుకోసం ఎంతటి నాటకమైనా ఆడేందుకు ఈ పార్టీలు రెడీగా ఉన్నాయాని సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్..! మరి ముస్లిం ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? అవకాశాద పార్టీలకా? లేక ఎప్పటిలాగానే తమ మతవాదానికా? అనేది తేలాలంటే మే 2వ తేదీ వరకు వెయిట్ చెయక తప్పదు.

    Trending Stories

    Related Stories