More

  పాతబస్తీలో రెచ్చిపోతున్న ఎంఐఎం.. జర్నలిస్టుపై ఎమ్మెల్యే డ్రైవర్ దాడి..!

  తెలంగాణలో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయి అనడానికి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. అలాగే హైదరాబాద్ పాతబస్తీలో ఓ వర్గం దౌర్జన్యాలు నిత్యకృత్యం. ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ అండతో అక్కడి వారు ప్రభుత్వ అధికారులను, పోలీసులను ఎదిరించడం.. వారిపై దాడులకు దిగడం మనం గతంలో చూశాం.

  అలాగే ఆ ప్రాంతంలో నివసించే ఓ వర్గం ఆధిపత్యమే అక్కడ చెల్లుతుంది. అక్కడ నివసించాలంటే వారు చెప్పిన విధంగా ఉంటేనే సాధ్యం అవుతుంది. ప్రభుత్వమైనా, ఇతర ప్రజలైనా వారి చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన అక్కడి పరిస్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

  పాతబస్తీలో ఎంఐఎం పార్టీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వారికి ఎవరూ ఎదురు తిరిగినా వారిపై దాడికి దిగుతారు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. హెచ్ఎస్ న్యూస్ ఛానల్ లో వీడియో జర్నలిస్టుగా పని చేస్తున్న అహ్మద్ అలీ వాళ్ల ప్రాంతంలో నీటి సరఫరా లేకపోవడంతో వీడియో తీసి ఛానల్ ప్రసారం చేశాడు. అలాగే అదే విషయాన్ని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాబ్ అహ్మద్ ఖాన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తన తండ్రితో కలిసి ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లిన మహ్మద్ అలీపై ఎమ్మెల్యే డ్రైవర్ దాడికి దిగాడు. అడ్డుకున్న మహ్మద్ అలీ తండ్రిపై కూడా తీవ్రంగా దాడికి దిగాడు. డ్రైవర్ జాఫర్ దాడిలో జర్నలిస్టు అతని తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాలతోనే వారికి జరిగిన అన్యాయాన్ని వీడియోలో వెల్లడించారు. వీడియోలో, అతని తండ్రి ముఖమంతా రక్తంతో అతని పక్కన నిలబడి ఉన్న దృశ్యాన్ని కూడా చూడవచ్చు. అది మ్యాగజైన్ ఆర్గనైజర్ వీక్లీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ పోస్టుతో విషయం తెలుగులోకి వచ్చింది. ఎంఐఎం పార్టీ పేద ముస్లింల కోసమే పని చేస్తుందని చెప్పుకునే అసదుద్దీన్ ఓవైసీ ఈ దాడిపై ఎలా స్పందిస్తారంటూ బాధితుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

  అలాగే రెండు నెలల క్రితం పాతబస్తీలో అర్థరాత్రి చార్మినార్ పత్తర్ గట్టి ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ సోహెల్ ఖాద్రి పోలీసులపై విరుచుకుపడ్డాడు. చార్మినార్ పోలీసు స్టేషన్ పరిధిలో యునాని ఆస్పత్రి ముందు పార్క్ చేయడంతో స్థానికులు 100 కాల్ చేశారు. ఫోన్ కాల్‌తో ఘటన స్థలానికి ఎస్సై వచ్చాడు. అక్కడికి వచ్చిన ఎస్సైని పట్టుకుని ఎంఐఎం కార్పొరేటర్ నానా హంగామా చేశాడు. 25 ఏండ్ల నుంచి ఇక్కడే పార్కింగ్ చేస్తున్నామని.. మీకు ఎవరు కంప్లైంట్ చేశారని కార్పొరేటర్ పోలీసులకు ఎదురుతిరిగాడు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తమాషా చేస్తున్నావా అంటూ పత్తర్ గట్టి కార్పొరేటర్ దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా పోలీసులకి ఫిర్యాదు చేసిన యునాని హాస్పిటల్‌ సిబ్బందిపై కూడా సయ్యద్ మండిపడ్డారు. అంతకుముందు ముషీరాబాద్‎లో బోలక్‌పూర్ కార్పొరేట్ హంగామా సృష్టించాడు. అర్ధరాత్రి బిర్యానీ అమ్మకాలను అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడారు. అది అప్పుడు పెద్ద వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

  ఇప్పటి వరకు పాతబస్తీలో కరెంట్ బిల్లులు కట్టలేదని కరెంట్ కట్ చేసిన అధికారులపై దాడులు చూశాం.. పోలీసులపై దౌర్జన్యానికి దిగిన స్థానికులను చూశాం.. నిబంధనలను పాటించని ఎంఐఎం ప్రజా ప్రతినిధుల తీరును సైతం చూశాం. కానీ తమ వర్గానికి చెందిన పేద ముస్లిం కుటుంబంపైనే.. అది కూడా ఓ జర్నలిస్టుపై కూడా దాడి చేయడం ఏంటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టుపై దాడికి దిగిన ఎమ్మెల్యే డ్రైవర్ జాఫర్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తనపై జరిగిన దాడిని మహ్మద్ అలీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. తాజా ఘటనతో పాతబస్తీలో శాంతి భద్రతలు ఎంతలా దిగజారిపోయాయో స్పష్టంగా అర్ధం అవుతుంది. అలాగే అక్కడ ఎంఐఎం నేతల అరాచకాలు కూడా వెలుగు చూస్తున్నాయి.

  Trending Stories

  Related Stories