More

  100 లో 99 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన ఎంఐఎం

  హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 100 స్థానాల్లో 99 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 2017లో సాధించిన దానితో పోల్చితే ఎక్కువ ఓట్లు వచ్చాయని అసదుద్దీన్ ఒవైసీ ఆనందించాల్సిందే. ఆయన నేతృత్వంలోని పార్టీ ముఖ్యంగా ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో పోటీ చేసినా ఎన్నికల్లో ప్రభావం చూపడంలో ఘోరంగా విఫలమైంది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎక్కువ శాతం ముస్లిం జనాభా,ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో AIMIM తన అభ్యర్థులను ఎక్కువమందిని నిలబెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల నుండి 38 మంది అభ్యర్థులను నిలబెట్టినప్పుడు అభ్యర్థులందరూ దాదాపు డిపాజిట్లు కోల్పోయారు.

  2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల నుంచి AIMIM అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ మాత్రం ఉత్తరప్రదేశ్‌లో పార్టీ మెరుగుపడుతోందని అన్నారు. ముబారక్‌పూర్ నియోజకవర్గానికి చెందిన షా ఆలం అలియాస్ గుడ్డు జమాలీ మాత్రమే డిపాజిట్‌ను కాపాడుకున్నారు. గతంలో బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నారు. బీఎస్పీని వీడిన తర్వాత మొదట సమాజ్‌వాదీ పార్టీని ఆశ్రయించిన ఆయనకు టికెట్ నిరాకరించారు. ఆ తర్వాత ఏఐఎంఐఎంలోకి వచ్చి ఏఐఎంఐఎం పార్టీ తరపున ముబారక్‌పూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తం ఓట్లలో 24% కంటే ఎక్కువగా అతను పొందాడు.

  ముస్లిం ఆధిపత్య స్థానాలలో, దేవబంద్ అత్యంత ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. సున్నీ ఇస్లామిక్, దేవ్‌బందీ శాఖకు చెందిన ఇస్లామిక్ సెమినరీ అయిన దారుల్ ఉలూమ్ దేవబంద్‌కు దియోబంద్ నిలయం మౌలానా ఉమైర్ మదానీకి AIMIM టిక్కెట్ ఇచ్చింది. అతడు కేవలం 3501 ఓట్లు మాత్రమే పొందగలిగాడు. దేవబంద్ నుంచి బీజేపీ అభ్యర్థి బ్రిజేష్ సింగ్ విజయం సాధించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వారణాసి నార్త్ అసెంబ్లీ స్థానంలో AIMIM ఆశ్చర్యకరంగా ముస్లిమేతర అభ్యర్థి హరీష్ మిశ్రాకు AIMIM టిక్కెట్ ఇచ్చింది.

  2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎంఐఎం కాస్త మెరుగైన పని తీరును కనబరిచింది. 2017లో AIMIM పార్టీ 38 మంది అభ్యర్థులను నిలబెట్టింది, వారు ఏకంగా 2 లక్షల ఓట్లను సాధించారు. ఈసారి పార్టీకి చెందిన 100 మంది అభ్యర్థులు 22 లక్షలకు పైగా ఓట్లను సాధించారు. ఇది ఓట్ల శాతంలో కాకపోయినా ఓట్ల సంఖ్యలో చాలా పెరుగుదల. 2017లో ఉత్తరప్రదేశ్‌లో ఏఐఎంఐఎంకు 0.2 శాతం ఓట్లు రాగా, 2022లో 0.4 శాతం ఓట్లు వచ్చాయి.

  Trending Stories

  Related Stories