ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలి.. అప్పుడే అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని అవుతారు: ఎంఐఎం నేత

0
976

అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM), ముస్లిం జనాభాను పెంచుకుంటూ వెళ్లడం ద్వారా భారతదేశంలో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చనే ప్రచారాన్ని చేస్తూ వస్తోంది. ఆ పార్టీ ముఖ్య నేత మాత్రమే కాకుండా మిగిలిన నేతలు కూడా తమ ప్రజలకు ఆ విషయాన్నే చెబుతున్నారు. ఇటీవల ఒక సమావేశంలో.. AIMIM అలీఘర్ జిల్లా అధ్యక్షుడు ఘుఫ్రాన్ నూర్ ముస్లింలు షరియా చట్టానికి విరుద్ధమైన కుటుంబ నియంత్రణ పద్ధతులను విస్మరించాలని, ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటం ద్వారా జనాభాను పెంచాలని కోరుతూ కనిపించారు.

తేదీ లేని ఓ వీడియో క్లిప్‌ ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ముస్లింలు భారతదేశంలో ‘అధికారాన్ని స్వాధీనం చేసుకునేందుకు’ ఎక్కువ మంది పిల్లలను కనమని నాయకుడు అడగడాన్ని చూడవచ్చు. “అబే జబ్ తక్ బచ్చే నా హోంగెన్ తో కైసే హమ్ లోగ్ (ముస్లింలు) రాజ్ కరేంగెన్? కైసే హమారే ఒవైసీ సాబ్ ప్రధానమంత్రి బనేంగే? కైసే సౌకత్ సాబ్ హమారే ముఖ్యమంత్రి బనేంగే?” అని నూర్ అన్నారు. “మనకు చాలా మంది పిల్లలు లేకపోతే మనం (ముస్లింలు) భారతదేశంలో ఎలా అధికారాన్ని చేజిక్కించుకుంటాం? అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని ఎలా అవుతారు? షౌకత్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు?”

ముస్లింలు మరియు దళితులు తక్కువ పిల్లలను కలిగి ఉన్నారని జనాభా నియంత్రణ చర్యలు షరియా చట్టానికి విరుద్ధమని నూర్ చెప్పుకొచ్చారు. అతను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ‘దో బచ్చే హి అచ్చే’ అవగాహన ప్రచారానికి వ్యతిరేకంగా ముస్లింలను ప్రేరేపించాడు. జనాభా నియంత్రణ విషయంలో ఒవైసీ బహిరంగంగా చెప్పిన మాటనే నూర్ తన ప్రజలకు పునరావృతం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రానికి జనాభా విధానం 2021-2030 బిల్లును ప్రతిపాదించినప్పుడు, హైదరాబాద్ ఎంపీ , AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. భారతదేశ ప్రజల ప్రాథమిక హక్కుకు వ్యతిరేకంగా జనాభా నియంత్రణ చట్టాన్ని ఆయన అభివర్ణించారు. నూర్ తన వైఖరిని నిర్మొహమాటంగా సమర్థించుకున్నాడు.. అయితే తాను బహిరంగ వేదికపై వ్యాఖ్యలు చేయలేదని చెప్పాడు. ఇండోర్ మీటింగ్‌లో షరియా, ఇతర సంబంధిత విషయాలను తన వ్యక్తులతో చర్చిస్తున్నట్లు అతను చెప్పారు.