More

    న్యూక్లియర్ మిసైల్‎ను విజయవంతంగా ప్రయోగించిన ఆర్మీ

    భారత రక్షణ శాఖ విజయవంతంగా అగ్ని 4 బాలిస్టిక్ మిసైల్‌ను పరీక్షించింది. ఈ మిసైల్ న్యూక్లియర్ పేలుడునూ తీసుకెళ్లే సామర్థ్యం గలది.

    ఒడిశా తీరంలో ఈ రోజు అగ్ని 4 క్షిపణని పరీక్షించారు. ఇది విజయవంతంగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. అగ్ని 4 క్షిపణి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగలదు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూరిందని భారత రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

    భారత రక్షణ సామర్థ్యాన్ని ఈ పరీక్ష మరోసారి వెల్లడించిందని భారత రక్షణ శాఖ తెలిపింది. ఈ రోజు సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో అగ్ని 4 క్షిపణిని ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతంగా సాగింది. అగ్ని క్షిపణుల సిరీస్‌లో అగ్ని 4 మిసైల్ నాలుగోది. ఇంతకు ముందు ఈ క్షిపణిని అ్నగి 2 ప్రైమ్‌గా వ్యవహరించేవారు. ఈ మిసైల్‌ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. గతేడాది భారత దేశం న్యూక్లియర్ సామర్థ్య గల అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల టార్గెట్‌ను ధ్వంసం చేసే సామర్థ్యం గలది. సరికొత్త సాంకేతికత, సామర్థ్యాలను వినియోగించుకుని భారత్ మరిన్ని వ్యూహాత్మక క్షిపణులను అభివృద్ధి చేస్తూ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాలను పెంచుకుంటున్నది.

    Trending Stories

    Related Stories