More

    రెండు నెలలు ముందుగానే జైలు నుంచి విడుదల అవుతున్న సిద్దూ..!

    పంజాబ్ కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అయితే సిద్ధూ రెండు నెలలు ముందుగానే విడుదల అవుతున్నారు. ఆయన మే నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే, జైల్లో ఆయన సత్ప్రవర్తన కారణంగా ముందుగానే 10 నెలల్లోనే విడుదలవుతున్నారు. ఆయనకు 48 రోజుల శిక్షాకాలం తగ్గింది.

    రోడ్డు పక్కనున్న వ్యక్తితో గొడవ కారణంగా జరగిన దాడిలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ కేసులో సిద్దూకి కోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు మేరకు పాటియాలా కోర్టులో ఆయన 10 నెలల జైలు శిక్షను అనుభవించారు. 34 ఏళ్ల క్రితం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. జైలు నుంచి సిద్దూ విడుదలవుతున్నారని ఆయన అఫీషియర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.

    డిసెంబరు 27, 1988న పాటియాలా నివాసి 65 ఏళ్ల గుర్నామ్ సింగ్‌తో పార్కింగ్ స్థలం విషయంలో నవజ్యోత్ సిద్ధూ వాగ్వాదానికి దిగాడు. నవజ్యోత్ సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్ సంధు గుర్నామ్ సింగ్‌ను అతని కారు నుండి బయటకు లాగి కొట్టారు. అనంతరం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్ధూ గుర్నామ్‌సింగ్‌ తలపై గట్టిగా కొట్టడంతో అతడు మరణించాడని ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు.

    Trending Stories

    Related Stories