International

విమానాలకు వేళాడుతూ.. ఆకాశం నుండి జారి పడిన ఆఫ్ఘన్ పౌరులు

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను వారి చేతుల్లోకి తీసుకోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయంతో ఆఫ్ఘన్ పౌరులు దేశాన్ని వీడాలని అనుకుంటూ ఉన్నారు. కాబూల్ ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున ఆఫ్ఘన్ పౌరులు చేరుకుని దేశాన్ని వీడాలని అనుకుంటూ ఉన్నారు. కాబూల్ విమానాశ్రయం నుండి దేశాన్ని విడిచిపెట్టాలని భావించిన ఆఫ్ఘన్ పౌరులు విమానాల టైర్లకు వేలాడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆ విమానాలు టేకాఫ్ అయిన తర్వాత ఆకాశం నుండి పడిపోయిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఈ దిగ్భ్రాంతికరమైన దృశ్యాలను జర్నలిస్టులు ట్విట్టర్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు.

మిడిల్ ఈస్ట్ ఐ కోసం పని చేస్తున్న టర్కిష్ బ్యూరో చీఫ్ రాగిప్ సోయిలు విమానాశ్రయం నుండి బయలుదేరే ముందు కొంతమంది ఆఫ్ఘన్ యువకులు ఫ్లైట్ ఇంజిన్‌లకు వేలాడుతున్న వీడియోను కూడా పంచుకున్నారు.

ఆఫ్ఘన్ ప్రజలు తమ ఇళ్లపై పడినట్లు స్థానికులు ధృవీకరించారు. శరీరం పైకప్పులను తాకినప్పుడు భయంకరమైన శబ్దం వచ్చిందని వారు అంటున్నారు. ఘోరమైన చావును వారు చవిచూశారని స్థానికులు తెలిపారు. కాబూల్ ఎయిర్ పోర్టుకు సంబంధించిన భయంకరమైన విజువల్స్ బయటకు వస్తున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఈరోజు అత్యవసరంగా భేటీ అవుతోంది. నేటి రాత్రి 7.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి భారత్ అధ్యక్షత వహించనుంది. ఆఫ్ఘనిస్థాన్ లో తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. ఆప్ఘన్ ప్రజలకు హాని తలపెట్టకుండా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా వ్యవహరించేలా తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కు ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1వ తేదీన ఈ బాధ్యతలను చేపట్టిన భారత్ నెల రోజుల పాటు ఈ బాధ్యతను నిర్వహించనుంది.

అమెరికా వెళ్లాల్సిన లేదా అక్కడి నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాలన్నింటినీ ఆఫ్ఘన్ గగనతలం మీది నుంచి కాకుండా దోహా మీదుగా మళ్లిస్తున్నట్టు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. దోహా హాల్టింగ్ లో ఇంధనం నింపుకుని ప్రయాణాన్ని మొదలుపెడతాయని చెప్పాయి. ఇప్పటికే షికాగో నుంచి వస్తున్న విమానాన్ని దారి మళ్లించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

8 − five =

Back to top button