International

ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఆప్ఘనిస్తాన్ విద్యార్థుల నిరసన

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకుని పరిపాలిస్తూ ఉండడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘన్ ప్రజలు తాలిబాన్లు తమను ఏమి చేస్తారోనని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న ఆఫ్ఘన్ ప్రజలు తాలిబాన్ ప్రభుత్వానికి నిరసనగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇతర దేశాలు స్వాగతించకూడదని కోరుతున్నారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్శిటీలో చదువుతున్న ఆప్ఘన్ విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారు. యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్ద ఆప్ఘనిస్థాన్ జెండాను వారు ఎగురవేశారు. తాలిబాన్ల పాలనలో జరుగుతున్న అరాచకాలను ఖండించారు. తాలిబన్ల అరాచకాలను తిప్పి కొట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. తమ దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని అన్నారు. తాలిబాన్ల పాలనకు ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలపకూడదని అన్నారు. ఇక తాలిబాన్లకు మద్దతు ఇస్తూ ఎన్నో దారుణాలకు కారణమైన పాకిస్తాన్ ను కూడా విద్యార్థులు తీవ్రంగా విమర్శించారు.

తాలిబాన్లు అధికారం లోకి రాగానే మహిళలపై ఎన్నో ఆంక్షలు విధిస్తూ ఉన్నారు తాలిబాన్లు..! పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయితో సహా అన్ని యూనివర్సిటీల్లో మహిళలు చదువుకోవచ్చని తాలిబాన్ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. కానీ ఇస్లామిక్ దుస్తులు ధరించడం తప్పనిసరి చేశారు. విశ్వవిద్యాలయాలలో మహిళా విద్యార్థులు హిజాబ్ ధరించాల్సి ఉంటుందని మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ అన్నారు. 20 సంవత్సరాల క్రితం ఉన్న చట్టాలను తాలిబాన్లు అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు దగ్గట్లుగానే ప్రభుత్వాన్ని నిర్మించడంలో బిజీగా ఉన్నామని తెలిపారు. అయితే లింగ వివక్ష అమలు ఉంటుందన్నారు. బాలురు, బాలికలు కలిసి చదువుకోవడానికి తాము అనుమతించమని ప్రకటించారు. కో- ఎడ్యుకేషన్ అస్సలు ఉండదన్నారు. మహిళా విద్యార్థులకు కేవలం మహిళా టీచర్లు మాత్రమే బోధించాలని అన్నారు. ఆఫ్ఘన్ మహిళలు క్రికెట్‌తో సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనరని.. క్రీడలు వారి శరీరాలను బహిర్గతం చేస్తాయని అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబాన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ కూడా చెప్పారు. ఇక దేశంలోని మహిళా క్రీడాకారిణులు అక్కడి నుండి పారిపోయారు. దేశంలో ఉంటే చంపేస్తారని లేదా శిక్షలు వేస్తారని భయపడుతున్న ఫుట్ బాల్ జట్టు మహిళలు పాకిస్తాన్ కు పారిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ ఫుట్ బాల్ మహిళా జట్టుకు చెందిన 32 మంది క్రీడాకారిణులు, వారి కోచ్ లు కుటుంబాలతో సహా దేశం విడిచిపెట్టారు. ఖతర్ కు వెళ్లిపోదామనుకుంటే కాబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరగడంతో ఆ ప్రయత్నాలను మానుకున్నారు. బ్రిటీష్ ఫుట్ బాల్ ఫర్ పీస్ ఇన్ కో ఆపరేషన్ అనే స్వచ్ఛంద సంస్థ పాకిస్తాన్ ప్రభుత్వంతోపాటు.. పాక్ ఫుట్ బాల్ సమాఖ్యతో చర్చలు జరిపి పాకిస్తాన్ కు వెళ్లేందుకు సహాయపడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

two + 2 =

Back to top button