International

1000కి పైగా మరణాలు.. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం

ఆఫ్ఘనిస్తాన్ ను మరోసారి భూకంపం టెన్షన్ హడలించింది. బుధవారం వచ్చిన భూకంపానికి ఇంకా తేరుకోకముందే మరోసారి ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతూ ఉన్నారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఫజియాబాద్‌కు 76 కిలోమీటర్ల దూరంలో.. 163 కిలోమీటర్ల లోతున భూకంపం సంభించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు అయ్యింది. ప్రకంపనలతో వణికిపోయిన ప్రజలు.. వీధుల్లోకి పరుగులు తీశారు.

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రెండు దశాబ్దాలలో దేశంలో చోటు చేసుకున్న ఘోరమైన భూకంపంలో 1,000 మందికి పైగా మరణించినట్లు తెలిపింది. అంతర్జాతీయ సహాయం కోసం తాలిబాన్ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. బుధవారం తెల్లవారుజామున తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. గురువారం నాడు మరణించిన వారి సంఖ్య 1,000 దాటింది, 1,500 మందికి పైగా గాయపడ్డారు. ఖోస్ట్ ప్రావిన్స్‌లోని స్పెరా జిల్లాలో మరియు పక్టికా ప్రావిన్స్‌లోని బర్మాలా, జిరుక్, నాకా మరియు గయాన్ జిల్లాల్లో ఎక్కువగా భూకంపం కారణంగా దెబ్బ తిన్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండగా ఇప్పుడు ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్ ను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టింది.

Related Articles

Back to top button