Sports

భారత్ గెలవగానే.. స్క్రీన్ మీద ఉన్న హార్దిక్ పాండ్యాను ముద్దు పెట్టుకున్న ఆఫ్ఘన్ అభిమాని

భారత్ ఆసియా కప్ లో శుభారంభం చేసింది. భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో ఛేదించింది. హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జడేజా 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 35 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 35 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా జోడీ రాణించడంతో భారత్ విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా, నవాజ్ బౌలింగ్ లో తొలి బంతికే జడేజా అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు.

అందరూ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించారు. అయితే అందరి దృష్టి ఆఫ్ఘనిస్తాన్‌ అభిమానిపై పడింది. భారత్ గెలవగానే ఒక ఆఫ్ఘన్ అభిమాని టెలివిజన్ స్క్రీన్‌పై హార్దిక్ పాండ్యాను ‘ముద్దు’ పెట్టి మెన్ ఇన్ బ్లూ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా చూపించే వీడియో వైరల్ అవుతోంది. భారత క్రికెట్ జట్టు నమోదు చేసిన విజయంతో ఎంతో ఆనందంగా ఉన్నాడు. హార్దిక్ ఆటకు అతడు ఫిదా అయ్యాడనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

Back to top button