అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్.. ఇప్పుడు ఉబర్ డ్రైవర్

0
904

ఆఫ్ఘన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయెండా ఇప్పుడు అమెరికా లోని వాషింగ్టన్ DCలో ఉబెర్ డ్రైవర్‌గా పని చేస్తూ ఉన్నారు. ఆగస్ట్ 2021లో కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడానికి ఒక వారం ముందు పయెండా ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ అరెస్టు చేస్తారనే భయంతో అతను తన కుటుంబంతో కలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)కి పారిపోయాడు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల పట్ల అమెరికా ద్రోహం చేసినందని అంటున్నారు పయెండా. పయెండా జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వ చివరి ఆర్థిక మంత్రి తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నానని.. ఆ డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. తాను చేస్తున్న పనికి తానేమీ బాధపడడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల పట్ల నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. తనకు ఇల్లు అన్నది లేదు.. నేను ఇక్కడికి చెందినవాడిని కాదు, తాను ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్ళలేనని ఖలీద్ అన్నారు.

“ఆఫ్ఘనిస్తాన్ లో నేను చాలా దుర్మార్గాన్ని చూశాను. అక్కడి ప్రభుత్వ వైఫల్యంలో భాగమైనందుకు ఇప్పుడు కూడా బాధపడుతూ ఉన్నానని” అన్నారు. అక్కడి ప్రజల కష్టాలను చూసినప్పుడల్లా తన మనసుకు ఎంతో బాధగా ఉంటుందని పయెండా తెలిపారు.
అమెరికా మొదట్లో మంచి ఉద్దేశాలతోనే ఆఫ్ఘన్ లో చర్యలు తీసుకుంది.. కానీ రాను రానూ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని, యునైటెడ్ స్టేట్స్ బహుశా అలా ఊహించి ఉండదని అమెరికా ప్రమేయంపై వ్యాఖ్యలు చేశారు. పయెండా హోండా అకార్డ్‌ను నడుపుతున్నారు. ఈ వారం ప్రారంభంలో అతను ఆరు గంటల పని చేసి సుమారు $150 సంపాదించాడు. “రాబోయే రెండు రోజుల్లో నేను 50 ట్రిప్పులు పూర్తి చేస్తే, $95 బోనస్ అందుకుంటాను” అని తెలిపారు.