More

    మతాంతర వివాహం చేసుకున్న కుమార్తెను హత్య చేసిన తండ్రి.. తల్లి చూస్తూ ఉండగానే

    తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. నార్నూర్‌ మండలం నాగల కొండలో ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురిని తండ్రే హత్య చేశాడు. రాజేశ్వరి అనే యువతి వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో.. నెల కిత్రం ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. తమ మాట కాదని వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో కుమార్తెపై ఆ తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. ఆమెను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశారు. శుక్రవారం ఉదయం కత్తితో కన్న కూతురి గొంతుకోసి చంపాడు తండ్రి.

    నాగల కొండ గ్రామానికి చెందిన పవార్ రాజేశ్వరి(21) మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన షేక్ అలీం అనే యువకుడిని మతాంతర వివాహం చేసుకుంది. కొద్దిరోజుల కిందట గ్రామంలో పంచాయితీ పెట్టి రాజేశ్వరిని, షేక్ అలీంను విడదీస్తూ తీర్పు ఇచ్చారు. తనకు తన భర్తే కావాలంటూ తండ్రి పవార్ దేవిదాస్ తో గొడవకు దిగింది రాజేశ్వరి. దాంతో ఆగ్రహించిన దేవిదాస్ నడి రోడ్డుపై కూతురు గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసిన పవార్ తన కూతురును ఎవరో చంపేశారంటూ సమాచారం ఇచ్చాడు. పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో తండ్రి దేవిదాస్ రాజేశ్వరిని హత్య చేసినట్లుగా తేలింది. తల్లి సావిత్రి బాయి ఎదుటే రాజేశ్వరి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    Trending Stories

    Related Stories