National
Trending

వ్యాక్సిన్ల మధ్య గ్యాప్.. మంచి నిర్ణయమేనని అంటున్న ఆదార్ పూనావాలా

వ్యాక్సిన్ విధానంలో కేంద్రప్రభుత్వం కీలక మార్గదర్శకాలు తీసుకుని వచ్చింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండో డోసు 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా సూచించింది. గతంలో 28 రోజుల నుంచి ఆరు వారాల వ్యవధిలో వేసుకోవాలని నిబంధన ఉండగా.. వాక్సిన్ నుండి మంచి ఫలితాలు దక్కాలంటే గ్యాప్ ఎక్కువగా ఉండాలని తెలిపింది. ఇక కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ (ఎన్‌టీఏజీఐ) సూచించింది. డెలివరీ తర్వాత తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సూచనలు చేసింది. 12-16 వారాల మధ్య కోవిషీల్డ్‌ రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. ఇక కోవాగ్జిన్‌ డోసుల మధ్య ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఓ ఆదార్ పూనావాలా మాట్లాడుతూ ఎన్‌టీఏజీఐ తీసుకున్న నిర్ణయం సరైనదనేని చెప్పుకొచ్చారు. 12-16 వారాల మధ్య కోవిషీల్డ్‌ రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పడం మంచి సైంటిఫిక్ నిర్ణయం అని చెప్పారు. ఇలా చేయడం వలన వ్యాక్సిన్ సామర్థ్యం పెరుగుతుందని.. ఇమ్యూనిటీ కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్నది చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రస్తుతం నెలకు 72 మిలియన్ల కోవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేస్తోంది. ఉత్పత్తిని భారీగా పెంచాలనే డిమాండ్లు వస్తూ ఉండడంతో.. ఈ ఉత్పత్తిని నెలకు 100 మిలియన్‌ డోసులకు పెంచుతామని పూనావాలా చెప్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

two + eighteen =

Back to top button