More

    ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌.. బిడ్‌ గెలుచుకున్న అదానీ గ్రూప్

    ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ముంబైలోని ధారవి రూపురేఖలు మారనున్నాయి. రూ.5,069 కోట్ల బిడ్‌తో ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్ గెలుచుకుంది. ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ధారవిలో దాదాపు 58,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 520 ఎకరాల్లో విస్తరించి ఉన్న ధారవిలో 1,000,000 మందికి పైగా జనాభా ఉంది. ధారవిలో 12,000 వాణిజ్య సంస్థలు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టుకు రూ.70వేల కోట్లు ఖర్చు కానుందని అంచనా. అయితే రీ డెవలప్ మెంట్ కోసం రూ.20 వేల కోట్లు కావాల్సి ఉంది. వచ్చే 17ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి, వచ్చే ఏడేళ్లలో పునరావాసం పూర్తి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా 8కంపెనీలు రీడెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసం ముందుకు రాగా ఇందులో మూడు మాత్రమే బిడ్ ను దాఖలు చేశాయి. డీఎల్ ఎఫ్ 2,025కోట్లకు బిడ్ వేసింది. గత 15 సంవత్సరాల్లో అనేక విఫల ప్రయత్నాల తర్వాత, ధారావి పునరాభివృద్ధి చివరకు ఇప్పుడు ప్రారంభమవుతుంది. మొత్తంమీద ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 10 మిలియన్ చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం వచ్చే అవకాశం ఉంది.

    Trending Stories

    Related Stories