తమిళ్, తెలుగు, మళయాలం సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన పూజా రామచంద్రన్ తల్లి కాబోతోంది. తెలుగులో స్వామిరారా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పూజా పలు హిట్ సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేస్తూ వెళుతోంది. అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా కనిపించి ఆకట్టుకుంది. ఇక జాన్ కొక్కెన్ అనే నటుడ్ని పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాల్లో నటిస్తూ వస్తోంది పూజ. తాజాగా తాను తల్లి కాబోతున్నాను అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూజా రామచంద్రన్. తన భర్తకి ముద్దు పెడుతున్న ఫోటోలని షేర్ చేసి తమ ఇంట్లోకి బేబీ రాబోతోందని తెలిపింది పూజ. ఇన్నాళ్లు మేమిద్దరం ఫుల్ గా, హ్యాపీగా ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు మాతో ఎంజాయ్ చేయడానికి మరో లిటిల్ బేబీ రాబోతుంది. 2023 మాకు స్పెషల్ గా మారబోతుందని పోస్ట్ చేసింది.