More

    డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ టాలీవుడ్ నటి

    నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు న‌టి నైరా షాను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. డ్ర‌గ్స్ వాడుతున్నార‌న్న స‌మాచారంతో ముంబై జుహూలోని హోట‌ల్ రూంలో ఎన్సీబీ అధికారులు త‌నిఖీలు చేపట్టగా.. నైరా షాతోపాటు ఆమె స్నేహితుడు ఆశిఖ్ సాజిద్ హుస్సేన్ ను అరెస్ట్ చేశారు. సిగ‌రెట్స్ లో చుట్ట‌బ‌డి ఉన్న ఒక గ్రాము గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ అధికారి ఒక‌రు తెలిపారు. ఉద‌యం 3 గంట‌ల‌కు చేప‌ట్టిన త‌నిఖీల్లో ఇద్ద‌రి ద‌గ్గ‌ర గంజాయిని గుర్తించిన‌ట్టు తెలిపారు. ఆదివారం రాత్రి నైరా షా పుట్టిన‌రోజు తర్వాత హోట‌ల్ లో పార్టీ అనంత‌రం గంజాయి తీసుకున్న‌ట్టుగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న అధికారులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. నైరా షా తెలుగులో బుర్ర క‌థ చిత్రంలో న‌టించడం ద్వారా గుర్తింపును సొంతం చేసుకుంది.

    ఆశిక్ సాజిద్ హుస్సేన్‌, నైరా షాలను 5 స్టార్ హోటల్ నుండి నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల చట్టం ప్రకారం అరెస్టు చేశారు. బాంద్రా కోర్టులో బెయిల్ పొందిన తరువాత నటిని విడుదల చేశారు. నైరా తొలి చిత్రం 2017 లో విడుదలైన ఇఈ. ఆ తర్వాత దక్షిణాదిలో పలు సినిమాల్లో నటిస్తూ వస్తోంది.

    పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా ఎన్‌సిబి తెల్లవారుజామున హోటల్ లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. సిగ‌రెట్స్ లో చుట్ట‌బ‌డి ఉన్న ఒక గ్రాము గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. “తెల్లవారుజామున 3 గంటలకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాం.. సిగ‌రెట్స్ లో చుట్ట‌బ‌డి ఉన్న ఒక గ్రాము గంజాయిని స్వాధీనం చేసుకున్నాం” అని నివేదికలో తేలింది. నైరా షా ఆదివారం రాత్రి హోటల్‌లో తన పుట్టినరోజు ను జరుపుకున్నారు. పార్టీ తరువాత తన స్నేహితుడు ఆశిక్ సాజిద్ హుస్సేన్ తో కలిసి వేరే గదిలోకి వెళ్ళిపోయినట్లు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ఆమెకు ఏదైనా డ్రగ్ రాకెట్‌లో లింక్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఐపిసి సెక్షన్ 274 ప్రకారం, ఏదైనా మాదకద్రవ్యాలు సైకోట్రోపిక్ పదార్ధం యొక్క ఉత్పత్తి / తయారీ / సాగు, స్వాధీనం, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ లేదా వినియోగం నిషేధించబడింది. నైరా షా మరియు ఆమె ఆశిక్ సాజిద్ హుస్సేన్ మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి నేషనల్ డ్రగ్స్ & సైకోట్రోపిక్ పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

    వారిని అరెస్టు చేసిన తరువాత కోర్టుకు హాజరుపరిచే ముందు వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. పుట్టినరోజు వేడుకలో వారు నిషేధించిన మాదక ద్రవ్యాలను సేవించినట్లు నివేదికలో ఉంచారు. నైరా, ఆశిక్‌లకు స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. మాదకద్రవ్యాలు వారికి ఎక్కడ నుండి వచ్చాయో నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Related Stories