నటి మీరా మిథున్ ను అరెస్టు చేసిన పోలీసులు

0
824

షెడ్యూల్ కులాలకు వ్యతిరేకంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు తమిళ నటి, మోడల్ మీరా మిథున్‌ను చెన్నై నగర సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం కేరళలో అరెస్టు చేశారు. మిథున్‌పై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని 7 సెక్షన్ల కింద కేసు నమోదైంది.మిథున్ తన అరెస్ట్‌పై వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పోలీసు సిబ్బంది తనను వేధిస్తున్నారని ఆరోపిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో పోలీసు అధికారులు మిథున్ ఫోన్‌ను అప్పగించమని అడిగారు. ఆమె అరెస్ట్‌కి కొన్ని క్షణాల ముందు జరిగిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రతి ఒక్కరు, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆమె బెదిరించింది. ఒక అమ్మాయికి ఇలా జరగవచ్చా ? ఒక అమ్మాయికి ఇదే జరుగుతుందా ? అందరిని బయటకు వెళ్లమని చెప్పండి. నన్ను అరెస్ట్ చేస్తే ఇక్కడే కత్తితో పొడుచుకుని చనిపోతాను. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ తమిళనాడు పోలీసులు నన్ను హింసిస్తున్నారంటూ మీరా వీడియోలో రచ్చ చేసింది.

దళిత దర్శకులు, నటీనటుల వల్ల తనకు సినీ అవకాశాలు తగ్గిపోయాయని.. దళితులను సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించాలని వారివల్లే తనకు అవకాశాలు రావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన వివరణ ఇవ్వాలని మీరాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మీరా మిథున్ వస్తుందని అందరూ భావించారు. అయితే ఆమె మీరామిథున్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తన అరెస్ట్ కలలోనే సాధ్యమని వ్యాఖ్యానించింది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేసింది. తనను అరెస్ట్ చేయడం జరిగే పని కాదని, ఒకవేళ అది జరిగినా కలలోనే సాధ్యమని తెలిపింది. అయితే ఈరోజు మీరా మిథున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × 3 =