National

న‌టి మీనా చెబుతోంది ఇదే..!

న‌టి మీనా త‌న భ‌ర్త విద్యా సాగ‌ర్‌ మ‌ర‌ణంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతున్న అసత్య ప్ర‌చారంపై విచారం వ్య‌క్తం చేశారు. భ‌ర్త దూర‌మ‌య్యార‌నే బాధ‌లో తానుంటే… అదేమీ ప‌ట్టించుకోకుండా త‌న భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నారంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌నైనా స‌ద‌రు అస‌త్య వార్త‌ల‌ను నిలిపివేయాలంటూ ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆవేదన వ్యక్తం చేశారు. క‌ష్ట స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న భ‌ర్త ప్రాణాల‌ను కాపాడేందుకు త‌మిళ‌నాడు సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు శాయ‌శ‌క్తులా కృషి చేశార‌ని కూడా ఆమె పేర్కొన్నారు. తన ప‌రిస్థితిని అర్థం చేసుకుని త‌న కుటుంబ ప్రైవ‌సీకి భంగం క‌లిగించ‌రాద‌ని స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో మీడియాను మీనా కోరారు.

విద్యాసాగర్ మృతికి కారణాలంటూ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మీనా స్నేహితురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ స్పందించారు. కొవిడ్‌ బారిన పడకముందు విద్యాసాగర్‌కు బర్డ్‌ ఇన్‌ఫెక్షన్‌ అయిందని డాక్టర్లు చెప్పారని బయటపెట్టారు కళా మాస్టర్. ఈ విషయం అందరికీ ఆలస్యంగా తెలిసిందన్నారు. ఆ తర్వాత జనవరిలో విద్యాసాగర్ కోవిడ్ బారిన పడి, మళ్లీ కోలుకున్నారని తెలిపారు. మీనా తల్లి పుట్టినరోజు వేడుకలో విద్యాసాగర్‌ను కలిసినప్పుడు ఆయన బాగానే ఉన్నారని కళా మాస్టర్ అన్నారు.

నటి కుష్బూ మట్లాడుతూ మీనా భర్త మృతి విషయంలో మీడియా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మూడు నెలల క్రితం విద్యా సాగర్ కు కరోనా సోకటం నిజమేనన్నారు. అయితే కరోనా సోకడం వల్ల విద్యాసాగర్ లంగ్స్ కు హాని జరిగిందని కుష్బూ అన్నారు. కరోనా వల్ల విద్యాసాగర్ చనిపోయాడని తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆమె కోరారు.

Related Articles

Back to top button