Telugu States

ఇటీవలే కుమారుడిని కోల్పోయిన నటి కవిత.. ఇప్పుడు మరో విషాదం

టాలీవుడ్ సీనియర్ నటి కవిత జీవితంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కొద్దిరోజుల కిందటే కుమారుడిని కోల్పోయిన కవిత.. భర్తను కూడా కోల్పోయారు. ఆమె భర్త దశరథరాజు కన్నుమూశారు. దశరథరాజు కొన్నిరోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. ఆయనకు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

ఇటీవలే కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో కన్నుమూశారు. ఆ విషాద ఘటన మరువకముందే కవిత కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కవిత తనయుడు సంజయ్ రూప్ జూన్ 15న మరణించాడు. రెండు వారాల వ్యవధిలో భర్తను కూడా ఆమె కోల్పోయారు. దశరథరాజు సింగపూర్ కు చెందిన వ్యాపారవేత్త. కవిత, దశరథరాజుల పెళ్లి 1984లో జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సినిమాల నుంచి వైదొలిగాక కవిత టీడీపీలో చేరారు. అక్కడ ఆమెకు అవమానాలు ఎదురవ్వడంతో పార్టీ నుంచి తప్పుకున్నారు.

జూన్ నెలలో కరోనాతో అస్వస్థతకు గురైన కవిత కుమారుడు సంజయ్ రూప్ కోలుకోలేక మృతి చెందారు. కొడుకు ఆస్పత్రిలో కరోనాతో ఆసుపత్రి పాలవ్వడం చూసి కవిత భర్త దశరథ్ రాజ్ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కూడా కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. భర్త ఇంటికి క్షేమంగా తిరిగొస్తాడని భావిస్తున్న తరుణంలో ఆయన కూడా తుదిశ్వాస విడిచారు. రెండు వారాల వ్యవధిలో కుమారుడు, భర్తను పోగొట్టుకోవడంతో సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 − two =

Back to top button