నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు..!

0
551

బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో పదేళ్ల తర్వాత ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. నటి జియాఖాన్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు నటుడు సూరజ్ పంచోలి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పరిమిత సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కోర్టు సూరజ్ పంచోలిని నిందితుడిగా పరిగణించలేదని అన్నారు. దీంతో సూరజ్ ను నిర్ధోషిగా ప్రకటిస్తున్నట్లు జడ్జి ఏఎస్ సయ్యద్ తీర్పు చెప్పారు. ఆత్మహత్యను హత్య అంటూ కేసు విచారణను జియాఖాన్ తల్లి జాప్యం చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. జియాఖాన్ 2013 జూన్ 3న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె వయసు 25 ఏళ్లు. ఘటన జరిగిన వారం తర్వాత జియా రాసినట్టుగా భావిస్తున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా సెక్షన్ 306 కింద సూరజ్ పంచోలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే కోర్టు తీర్పు పట్ల సంతోషంగా లేనని జియాఖాన్ తల్లి రబియా ఖాన్ అన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.