కన్నుమూసిన ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్

0
860

ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన వయసు 70. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. డైరెక్టర్‌గా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

కేరళ – తిరువనంతపురంలో 1951 ఆగస్టు 13వ తేదీన ఆయన జన్మించారు. 1978లో మలయాళ సినిమా ద్వారా నటుడిగా వెండితెరకి పరిచయమయ్యారు. ముందుగా మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన ఆయన, ఆ తరువాత కాలంలో తమిళంలో బిజీ అయ్యారు. ‘ఆకలి రాజ్యం’ , ‘కాంచనగంగ’, ‘జస్టీస్ చక్రవర్తి’ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించారు. 1985లో ప్రముఖ నటి రాధికను ఆయన వివాహం చేసుకున్నారు. 1986లో ఆమె నుంచి విడాకులు పొందారు. ఆ తర్వాత అమలా సత్యనాధ్ అనే కార్పొరేట్ ఉద్యోగిని పెళ్లి చేసుకున్నారు. 2012లో ఆమె నుంచి కూడా ప్రతాప్ విడాకులు తీసుకున్నారు.