More

    రావణుడి పాత్ర పోషించిన అరవింద్ త్రివేది ఇక లేరు

    దూరదర్శన్‌ వచ్చిన ‘రామాయణ్’ ధారావాహిక.. ఇది భారతీయుల మదిలో ఎప్పటికీ నిలిచి ఉండే సీరియల్..! ఇందులో ప్రతి ఒక్క పాత్రధారులు కూడా ప్రజలకు గుర్తుండి పోతారు. ఆ సీరియల్ లో రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. గుండె పోటుతో గత రాత్రి ఆయన మరణించారు. త్రివేది మరణవార్తను పలు మీడియా సంస్థలు ధృవీకరించాయి. ఇది విచారకరమైన వార్త అని, తమ ప్రియమైన అరవింద్ భాయ్ ఇక లేరని పలువురు ప్రముఖులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అదే సీరియల్‌లో లక్ష్మణ్ పాత్రను పోషించిన సునీల్ లహ్రి తండ్రి సమానులైన అరవింద్ త్రివేది గారిని కోల్పోయానని చెప్పారు. కరోనా లాక్ డౌన్ సమయంలో రామాయణంను మరోసారి ప్రసారం చేయగా ప్రజాదరణలో అగ్రస్థానంలో నిలిచింది.

    అరవింద్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. గత మూడేళ్లుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని అరవింద్ మేనల్లుడు కౌస్తుబ్ త్రివేది తెలిపారు. గత రాత్రి 9.30 గంటల సమయంలో ఆయనకు గుండెనొప్పి వచ్చినట్టు చెప్పారు. ముంబైలోని తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్టు పేర్కొన్నారు.1991 నుంచి 96 వరకు సబర్కథ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు.

    82 ఏళ్ల వయసు గల అరవింద్ త్రివేది గడచిన 40 ఏళ్లపాటు హిందీ,గుజరాతీ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. 300 చిత్రాల్లో నటించిన అరవింద్ గుండెపోటుతో మరణించారు. రావణ్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన అరవింద్ అంత్యక్రియలు బుధవారం ముంబైలో జరగనున్నాయి. ఈయన పలు పలు పౌరాణిక చిత్రాల్లో నటించారు.

    Trending Stories

    Related Stories