More

  బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కాంతార’

  న్నడ సినిమా ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పరుగులు తీస్తోంది. కేజీయఫ్‌ వేసిన బాటలో నడవడానికి పలు చిత్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రేసులో ఉన్న చిత్రమే ‘కాంతార’. పూర్తిగా కన్నడిగులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమా. కర్ణాటకలో మంచి పేరు రావడంతో మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు. ‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం ‘కాంతార’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు పైగా గ్రాస్ ను సాధించి బాక్సాఫీస్ ని పరుగులు పెట్టిస్తోంది. ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం అవ్వడం అనేది అరుదైన విషయం.’కాంతార’ చిత్రం విడుదలైన పదిహేడవ రోజు కూడా 900 శాతం కలక్షన్స్ పెరగడం అనేది ఈ చిత్రం విజయానికి నిదర్శనం. కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్’ ద్వారా తెలుగులో విడుదల చేశారు. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టడం విశేషం. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తోంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ ‘కాంతార’ క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి. అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం.. తెలుగులో కూడా అంతకు మించిన విజయఢంకాను మోగిస్తోంది. ‘కాంతార’ విడుదలైన మొదటి రోజే 5 కోట్లు గ్రాస్ సాధించడమంటే మాటలుకాదు. ఈ సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకునికి ఒళ్ళు గగుర్పొడిచేలా ఈ చిత్ర క్లైమాక్స్ ను మలిచాడు రిషబ్ శెట్టి. తనలో ఉన్న దర్శకుడుని నటుడు డామినేట్ చేసాడు అనేంతలా ప్రేక్షకుడికి మర్చిపోలేని విజువల్ ట్రీట్ ఇచ్చాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు “కాంతార” క్లైమాక్స్ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా అదే మాదిరిగా విజయఢంకాను మోగిస్తుంది. రిషబ్ శెట్టి హీరోగా, రచించి దర్శకత్వం వహించిన ఈ ‘కాంతార కన్నడ చిత్రం ఇతర బాషల్లో కూడా విడుదలయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే తెలుగు లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం హిందీ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. సోమవారం ఈ చిత్రం హిందీలో మరో 1.7 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకూ 20 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను సాధించే అవకాశం ఉంది. దీపావళి పండుగ కి వస్తుండటం, టాక్ కూడా పాజిటివ్ గా ఉండటం సినిమాకి కలిసి వచ్చే అంశం. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చినటువంటి మరో భారీ హిట్ చిత్రాల్లో ఈ “కాంతారా” కూడా ఒకటి. ఈ ఇంటెన్స్ రూరల్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకొని భారీ హిట్ అయ్యింది. మరి కన్నడలో మొదటగా విడుదలై భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం తాజాగా తెలుగులో గీతా ఆర్ట్స్ నుంచి విడుదలై అక్కడ కన్నా ఎక్కువ ఓపెనింగ్స్ ని సాధించి తెలుగు ప్రేక్షకులు ట్రేడ్ షాకిచ్చారు. మరి మొదటి రెండు రోజుల్లోనే 11 కోట్లకి పైగా ఒక్క తెలుగు భాషలోనే వసూలు చేయగా, ఇప్పుడు మూడో రోజు కూడా 5 కోట్ల గ్రాస్ ని అందుకొని మూడు రోజుల్లో 16.5 కోట్లు అందుకొని భారీ విజయాన్ని నమోదు చేసింది. సోమవారం కూడా 5 కోట్లు వసూలు చేయడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి. విలేజ్ డ్రామా తో ఎంతోమందిని ఆకట్టుకుంటున్న ఈ ‘కాంతార’ కన్నడ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతున్న తీరు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి సినిమాను ఘనంగా విడుదల చేశారు. ఈ సినిమా ఆక్యుపెన్సీ గత రెండు రోజులుగా పెరుగుతూ ఉండటంతో వసూళ్లు బాగా రావడం మాత్రమే కాకుండా, సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
  అల్లు అరవింద్ ఈ సినిమాను కేవలం మూడు కోట్లకు కొన్నారని, ఇప్పటికే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లి కలెక్షన్ల సునామినే సృష్టిస్తోంది. ఈ చిత్రం లాంగ్ రన్ ముగిసే సమయానికి భారీ ప్రాఫిట్ లను సాధించే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రైట్స్‌ కోసం వెచ్చించిన డబ్బుకు మూడు నుంచి నాలుగు రెట్లు సంపాదించొచ్చు. తెలుగులో అక్టోబర్ 15న విడుదలైన ‘కాంతార’ భారీ కలెక్షన్ తో దూసుకెళుతూ టాలీవుడ్ ని విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అన్ని ఏరియాల్లో కూడా సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుండడం విశేషం. ముఖ్యంగా అటు ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ అదరగొట్టేలా పెర్ఫార్మ్ చేస్తోంది. హీరోగా నటించిన రిషబ్ శెట్టి, శివ పాత్రలో కనబరిచిన అత్యద్భుత నటన, ఇతర పాత్రధారుల సహజ సిద్దమైన పెర్ఫార్మన్స్, ఆకట్టుకునే కథ కథనాలు, అత్యద్భుతంగా రూపొందిన మూవీ గ్రాండియర్ విజువల్స్, భారీ నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇలా ప్రతి ఒక్క అంశం కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటూ ప్రస్తుతం ‘కాంతార’ తెలుగులో రోజురోజుకు మరింత క్రేజ్ తో కొనసాగుతోంది. ఇక హిందీ వర్షన్ కి కూడా అక్కడి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ హిందీ వర్షన్ కి ఫస్ట్ డే రూ. 1. 27 కోట్ల కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీకి మంచి రేటింగ్స్ తో పాటు రివ్యూస్ కూడా వస్తుండడంతో మరింతగా ఇకపై కలెక్షన్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తంగా అన్ని భాషల ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాంతార సూపర్ క్రేజ్ తో కొనసాగుతుండడం విశేషం. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎంత మేర కొల్లగొడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
  ఇంతకీ ‘కాంతారా’లో ఏముంది?
  అటవీప్రాంతంలోని ఓ కుగ్రామం. రాజుల కాలం నుంచి అక్కడొక ఆనవాయితీ ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడు పూనుతుంటాడు. అతను ఆ పూనకంలో ఊరి పెద్దకి ఊరి మేలు కోసం దిశానిర్దేశం చేస్తుంటాడు. ఆ క్రమంలో తరాలు గడుస్తుంటాయి. 1990 ల కాలం వస్తుంది. అక్కడ కూడా పూనకం వచ్చే వ్యక్తి ఉంటాడు. ఊరి పెద్దకి భూదాహం. పేదల భూములన్నీ లాక్కోవాలనుకుంటాడు. ఇంతకీ పూనకం వచ్చే వ్యక్తి మన హీరో శివకి తండ్రి. కానీ ఊరి పెద్ద దైవ ధిక్కారం వల్ల ఆ పూనకంలోనే అతను మిస్టీరియస్ గా మాయమైపోతాడు. ఇక తిరిగిరాడు. హీరో పెరిగి పెద్దవుతాడు. తర్వాత ఏం జరుగుతుందనేది కథ. ఈ కథలో అటవీభూములు, వాటి అక్రమణలు మొదలైన అంశాలకు సంబంధించిన కథ సమాంతరంగా నడుస్తుంటుంది. కథ‌ ఎలా ఉన్నా సాంకేతికత బలంగా ఉంటే ప్రేక్షకుల్ని ఎలా కూర్చోపెట్టొచ్చో పాఠం చెప్పే సినిమా ఇది. సాంకేతికత అనేది స్క్రీన్ ప్లే, కెమెరా, ఎడిటింగ్, నేపథ్య సంగీతాల్లో ప్రధానంగా నిక్షిప్తమై ఉంటుంది. అవన్నీ అద్భుతంగా ఉండడం వల్ల కథలో కూడా ఏదో అద్భుతముందనే భావన కలుగుతుంది. అభూతకల్పన అయినా, రియలిస్టిక్ అయినా, సూపర్ నేచరల్ అయినా, క్రైం అయినా..ఏ జానర్ అయినా కూడా సాంకేతికతతో హిస్టిరికల్ గా అద్భుతాన్ని సృష్టంచగలిగితే కథలో లోపాలు కూడా ప్రేక్షకుల అనుభూతికి అడ్డురావు. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. ఎక్కడా వాడుకలో లేని పదాలు లేవు. పాటల్లో సాహిత్యం కూడా తెలుగుతనం ఉట్టిపడుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా కొత్త కథ.
  ‘కాంతార’ మిస్ అవ్వొద్దంటున్న ప్రభాస్..
  ప్రస్తుతం కన్నడలో తెరకెక్కి అక్కడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తున్న ‘కాంతార’ సినిమాను చూసిన ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా యూనిట్ ని అభినందిస్తూ పోస్ట్ చేసారు. ‘నేడు కాంతార మూవీ రెండవసారి చూసాను, సినిమాలో హీరో రిషబ్ శెట్టి తో పాటు ఇతర పాత్రధారులు అందరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారు. మూవీ కాన్సెప్ట్ అదిరిపోయింది, అలానే క్లైమాక్స్ అయితే మరింత అద్భుతం, ప్రతి ఒక్కరు కూడా ‘కాంతార’ చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ ప్రభాస్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
  ‘కాంతార’పై అనుష్క కామెంట్స్..
  కన్నడ నాట సెన్సేషన్ క్రియేట్ చేసిన మరో హిట్ చిత్రం ‘కాంతార’ తెలుగులో థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. మొదటి రోజే మంచి వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సూపర్ హిట్ సినిమా చాలా మంది సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. ‘కాంతార’ను చూసి మేకర్స్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ”కాంతార’ చిత్రాన్ని చూసాను. పూర్తిగా నచ్చింది, నటినటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ కి ధన్యవాదాలు. దయచేసి సినిమాని థియేటర్లలో చూడండి. మిస్ అవ్వకండి ” అంటూ సోషల్ మీడియాలో ఈ చిత్రం పై పోస్ట్ చేశారు. అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
  ‘కాంతారా’ పై ధనుష్ సాలిడ్ రివ్యూ..
  గ్లోబల్ స్టార్ ధనుష్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది. కాంతారా చిత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంది. రిషబ్ శెట్టి చాలా గర్వించేలా చేసాడు, బౌండరీలు చెరిపేస్తున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారికి కంగ్రాట్స్, సినిమాలో పని చేసిన ప్రతి ఒక్క నటునికి అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్ కి బిగ్ హగ్ అందిస్తున్నానని ధనుష్ అయితే తన సాలిడ్ రివ్యూ తెలిపాడు.

  కన్నడ సినీ రంగం హఠాత్తుగా కేజీఎఫ్ తో తన సాంకేతిక శక్తి ఎమిటో చూపించింది. దానికి ఏ మాత్రం అనుకరణ కాకుండా మరొక కోణంలో ఈ ‘కాంతార’ కన్నడ సినీరంగ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసింది. కొత్త తరహా కథలు రావాలి అని కోరుకునే వారికి “కాంతార” కొంత ఉపశమనాన్ని ఇస్తుంది.

  Trending Stories

  Related Stories