More

  ఇంద్రకీలాద్రిలో భారీ అవినీతి.. ప్రభుత్వానికి నివేదిక అందించిన ఏసీబీ.. నమ్మలేని నిజాలను వెల్లడించిన నివేదిక

  తాజాగా ఇంద్రకీలాద్రీపై ఏసీబీ దాడులకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మవారి సన్నిధిలో జరిగిన అవినీతిపై ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ వరకు జరిపిన సోదాల వివరాలను నివేదికలో పేర్కొన్న ఏసీబీ ఈవో సురేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. ఈవో సురేష్ బాబు అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.

  ఈ దేశంలో హిందువుల ఆలయాలకు రక్షణ లేదు అనే విషయం మరోసారి రుజువైంది. హిందూ ఆలయాలను.. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వాలు మార్చేశాయి. ఆలయ కమిటీల పేరిట అక్రమార్కులకు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా బయటపడుతున్నవాస్తవాలు ఇదే చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ వ్యవహారాలలో అధికారుల అవినీతి మరకలు వెలుగు చూస్తున్నాయి. చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా.. దుర్గగుడి అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందా.. అనే బలమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  తాజాగా ఇంద్రకీలాద్రీపై ఏసీబీ దాడులకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మవారి సన్నిధిలో జరిగిన అవినీతిపై ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ వరకు జరిపిన సోదాల వివరాలను నివేదికలో పేర్కొన్న ఏసీబీ ఈవో సురేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. ఈవో సురేష్ బాబు అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. ముఖ్యంగా టెండర్ల కేటాయింపులు, కాంట్రాక్టర్లకు చెల్లింపుల వంటి అంశాల్లో ఈవో సురేష్ బాబు అడిట్ అభ్యంతరాలను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. చెల్లింపులపై ప్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా ఆవో బేఖాతరు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ జనరల్ ఇచ్చిన మార్గదర్శకాలు విరుద్ధంగా చెల్లింపులు ఈవో చెల్లింపులు చేసినట్లు తెలిపింది. అలాగే రూల్స్ కు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్ కు కాంట్రాక్టులు ఇచ్చారని.. శానిటరీ టెండర్ల కేటాయింపులోనిబంధనలు పట్టించుకోలేదని పేర్కొంది.

  ఈ టెండర్ల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. తక్కువ సొమ్ముకు కేట్ చేసిన స్పార్క్ కంపెనీని పక్కనబెట్టారని ఆరోపించింది. ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది టెండర్లను అక్రమంగా మ్యాక్స్ సంస్థకు కట్టబెట్టినట్లు ఈవో సురేష్ బాబుపై ఆరోపణలున్నాయి. టెండర్ ప్రక్రియలో కొటేషన్లను లీక్ చేసి మ్యాక్ సంస్థకు లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది. అమ్మవారి రథంపై వెండి సింహాల మాయం ఘటనలో మ్యాక్స్ సంస్థ వైఫల్యం సప్ష్టంగా కనిపించింది. ఇప్పటికే అవినీతి వ్యవహారంలో 16 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేయగా… ఈవోపై చర్యలు తప్పవనే ప్రచారం జరుగుతోంది.

  ఇటీవల కనకదుర్గమ్మ ఆలయం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. అమ్మవారి వెండిరథంపై సింహాల ప్రతిమల అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు నాలుగు నెలల విచారణ అనంతరం నిందితులను పట్టుకున్నారు. చోరీ చేసిన వెండిని కూడా అధికారులు రికవరీ చేశారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ధరలు పెంచడం, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా భక్తులను అనుమతించడం, ముందస్తు బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

  అలాగే అమ్మవారి హుండీ లెక్కింపులోని ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. నవరాత్రుల తర్వాత ఇద్దరు ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించగా.. వారి దగ్గర నగదు రికవరీ చేసి పంపారే తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. హుండీ లెక్కింపు సమయంలో ఆలయ అధికారులు నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఇక భవానీ దీక్షల విరమణ సందర్భంగానూ అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరిగింది. అలాగే గతంలో అమ్మవారి చీరలు మాయమైన ఘటనపై కూడా ఆలయ అధికారులు, పాలకమండలి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

  ఇలా ఎన్నో అవినీతి, అక్రమాలు బయటపడుతున్న తరుణంలో… హిందువులు ఒకటే కోరుకుంటున్నారు.. దయచేసి మా ఆలయాలను మాకు వదిలేయండి.. ఇతర మతాల వారు ఎలాగైతే వారి వారి స్థలాలను వారే చూసకుంటున్నారో.. మేమూ మా ఆలయాలను పరిరక్షించుకుంటామని ప్రభుత్వాలను కోరుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. ఆలయ కమిటీలు పూర్తి అవినీతి, రాజకీయ కంపుతో గబ్బుపట్టిపోయాయని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హిందువుల సంఘటిత శక్తి మాత్రమే.. వారి హక్కులను కాపాడగలదని.. అలా కాకుండా ఎవరికి వారు కుల, మత, ప్రాంత, భాషా, వర్గములుగా విడిపోయి ఆలోచిస్తే తీరని నష్టం కలుగుతుందని.. గురువులు, సంత్ లు హెచ్చరిస్తున్న మాట.

  Trending Stories

  Related Stories