Telugu States

కేటీఆర్ కు చేదు అనుభవం.. ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. నారాయణ పేట జిల్లా పర్యటనలో కేటీఆర్ కాన్వాయ్ ను ఎబివిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. నారాయణ పేట జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఆసుపత్రిని ప్రారంభించి మరొక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్ ని ఏవీబీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. పోలీసులు ఎబివిపి కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. మంత్రి పర్యటనలో అకస్మాత్తుగా కాన్వాయ్‎ని ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కేటీఆర్ కాన్వాయ్ మీదకి దూసుకురావడంతో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో మంత్రి పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

జిల్లా కేంద్రంలోని ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్స‌వాలు చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సావర్కర్ చౌరస్తా వరకు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించే సివిల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సింగారం చౌరస్తా వద్ద పది కోట్ల రూపాయలతో నిర్మించే టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అశోక్ నగర్ వద్ద రూ. 20 లక్షల తో అమరవీరుల స్థూపం నిర్మాణానికి‌ శంకుస్థాపన చేశారు. నారాయణపేటలో పది వెంటిలేటర్లతో ఏర్పాటు చేసిన ఐసియు వార్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆర్టీసీ కాలనీలో నిర్మించిన సైన్స్ పార్కు ప్రారంభించనున్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి, క‌లెక్ట‌ర్ హరిచంద‌న‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − thirteen =

Back to top button