National

ఆలయాన్ని సందర్శించినందుకు బాలీవుడ్ నటికి తిట్లు, బెదిరింపులు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నందుకు బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆమె నటించిన చిత్రం ‘అత్రంగి రే’ విడుదలకు ఒక రోజు ముందు ఇస్లాంవాదుల దాడికి గురైంది. ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఆమె గుడి కాంప్లెక్స్‌లో నిలబడి ఉన్న ఫోటోను అప్లోడ్ చేసింది. సాయంత్రం హారతి చూసేందుకు ఆమె దాదాపు 30 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. ఆమె ఫోటోతో పాటు ‘జై మహాకాల్’ అని పోస్టు చేసింది.

ఆమె చిత్రాన్ని పోస్ట్ చేసిన తర్వాత, విగ్రహారాధన ‘పాపం’ చేసినందుకు బాలీవుడ్ నటిని పలువురు దుర్భాషలాడారు. “ఎందుకు ఇలా చేస్తున్నావు. నువ్వు ముస్లింవా? దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నావు?” ఒక ఇస్లామిస్ట్ రాశాడు. ముస్లిం అయినప్పటికీ, మీరు విగ్రహారాధన చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. “నీకు సిగ్గుగా అనిపించలేదా? మీరు ముస్లింల పేరుకు మచ్చ” అని మరొకరు రాశారు. సారా అలీ ఖాన్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, నటి అమృతా సింగ్‌లకు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను పలువురు ఇస్లామిస్టులు తిడుతూ వస్తున్నారు. ఇంకొందరైతే బెదిరింపులకు కూడా దిగారు.

కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినందుకు సారా అలీ ఖాన్‌పై ఇస్లాంవాదుల దాడి

హిందూ దేవాలయం లేదా ప్రార్థనా స్థలాలను సందర్శించినందుకు సారా అలీ ఖాన్‌ను ఇస్లాంవాదులు టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో, జాన్వీ కపూర్‌తో కలిసి హిందూ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను సందర్శించినందుకు బాలీవుడ్ నటిని ఇస్లాంవాదులు దుర్భాషలాడారు. హిందూ దేవుడైన శివుని నివాసమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని ఆమె సందర్శించినందుకు కూడా ఆమెపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఇస్లామిస్ట్‌లు ఆమెను దుర్భాషలాడగా, మరికొందరు హిందూ మందిరాన్ని సందర్శించి విగ్రహం ముందు ప్రార్థన చేయడం ద్వారా ముస్లింలకు కళంకం తెచ్చావని ఆరోపించారు.

Related Articles

Back to top button