Download and install Nationalist Hub Mobile App for instant updates from us.

నేషనలిస్ట్ హబ్

కుహనా సెక్యులర్, కమ్యూనిస్టు భావనల కారణంగా తెలుగునాట జాతీయతా భావన లుప్తమౌతోంది. కుయుక్తికి కీర్తి కిరీటాలు తొడగబడ్డాయి. సాంస్కృతిక గతం విస్మరణకు గురైంది. దేశ సమగ్రత, దేశభక్తి నిందార్థంలో వాడుతున్న కాలమిది. ఈ ఖాళీలను పూరించేందుకు, కొత్త తరానికి ప్రాచీన వైభవాన్ని పరిచయం చేసేందుకు ముందుకు వచ్చింది నేషనలిస్ట్ హబ్.

ప్రజా ప్రయోజనాన్ని మరచి ఇతరేతర ప్రలోభాల ప్రాతిపదికన వార్తకు రాజకీయ ప్రయోజనం జోడిస్తూ ఈ మధ్య కాలంలో చాలా మాధ్యమాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట సందర్భంలో ప్రజల జీవితాలను ప్రభావితం చేసే రాజకీయ వ్యవస్థ పై కీలక విశ్లేషణలు చేసే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చింది నేషనలిస్ట్ హబ్.

దేశంలో రాజకీయ పరిస్థితులు, సంస్కృతి, ఆర్థిక విధానాలతో థియోసఫిస్టుల ఔదార్యానికి గురికావాల్సి వచ్చిన అనేక అంశాలను వలసవాద దృక్పథం నుంచి కాకుండా దేశీయ భావనల వెలుగులో విశ్లేషించే ప్రయత్నం చేయడమే నేషనలిస్ట్ హబ్ లక్ష్యం.



సూటిగా చెప్పాలంటే...

  • మా టార్గెట్... దేశ సమగ్రతకు భంగం కలిగించే కుహనావాదులు.
  • మా టార్గెట్... రాజకీయం ముసుగులో ప్రజలను పీక్కుతినే నాయకులు.
  • మా టార్గెట్... స్వప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేసే సూడో సెక్యులర్ లు.
  • మా టార్గెట్... జాతీయవాదానికి, ఉగ్రవాదానికి తేడా తెలియని స్వయం ప్రకటిత మేధావులు.
  • మా ప్రయత్నం... వక్రీకరించిన చరిత్ర వెనక వాస్తవాలు చెప్పడం.
  • మా సంకల్పం... రాజకీయ కుట్రల్ని ప్రజల ముందుంచడం.
  • మా లక్ష్యం... భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని భావితరాలకు అందించడం.
  • గుండెలనిండా మువ్వన్నెల జెండా, జాతీయవాదమే మా ఎజెండా.

  • NATIONALIST HUB – A ‘NEW’S REVOLUTION