More

  ఢిల్లీ మున్సిపల్ మార్కెట్..! ఆప్ టిక్కెట్ల అమ్మకాల జోరు..!!

  నిజానికి నిదానం ఎక్కువ. అబద్ధానికి తొందరెక్కువ. అయితే, ఈ నిదానాలు, తొందర మాటలు ఎలా వున్నా.. ఆరోపణలు, అమ్మకాలు, చేయిచేసుకోవడాలు మాత్రం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జోరుగా సాగిపోతున్నాయి. కూరగాయల మార్కెట్లో కూరలు అమ్మేసినట్టు.. ఎన్నికల టిక్కెట్లు అమ్మేశారని ఆప్ కార్యకర్తలు ఆ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ పై దాడికి దిగారు. మతియాల నియోజకవర్గ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ పై ఆప్ కార్యకర్తలు మతిలేనట్టు ప్రవర్తించారని కొందరు అంటుండగా, మరికొందరు అవినీతి పరుడికి తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు సింగ్ యాదవ్ కాలర్ పట్టుకుని కొట్టడంతో…తనను తాను రక్షించుకోవడం కోసం యాదవ్ సభ నుంచి అటు, ఇటు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిత్రులారా ఈ అంశాన్ని చూసే ముందు మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.

  డిసెంబర్ లో జరగాల్సిన MCD ఎన్నికల టిక్కెట్లను తమ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఇష్టానుసారం అమ్మేసుకుంటున్నారని ఆప్ కార్యకర్తలు తెలిపారు. ఢిల్లీ శ్యామ్ విహార్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం జరుగుతుండగా, ఒక్కసారిగా ఎమ్మెల్యే సింగ్ పై ఆప్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలికాని, ఇంటి గుట్టు రట్టు చేస్తారా.. అని ఆ పార్టీ నేతలు తెగబాధపడిపోతున్నారు. అయితే, గుట్టు రట్టు చేయకుండా వుండడానికి, టికెట్ల విక్రేతకు బుజ్జగింపులు, మందలింపులు చేయడానికి.. ఇదేమైనా చిన్నవిషయమా.. జంతికలు, పకోడీలు అమ్మినట్టు ఎన్నికల టికెట్లను ఇష్టానుసారం విక్రయించేస్తారా..? ఎంత దారుణం.. అని కార్యకర్తలు మండిపడుతున్నారు.

  ఆయుధం చేతికి చిక్కితే వైరి పక్షం చేతులు ముడుచుకు కూర్చుంటుందా..! ఒక్కనాటికి కూర్చోదు. అదే పని చేసింది బీజేపీ. ఆ పార్టీ నేతలు దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాకు షేర్ చేశారు. ఆప్‎లో ఎమ్మెల్యే ఎన్నికల టికెట్లు అమ్ముకుంటారు.. కార్యకర్తలు తిరగబడతారు. నేతలు, కార్యకర్తలు కొట్టుకుంటారు. ఇదీ ఆ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం బీజేపీ నేతలు విమర్శించారు. కేజ్రీవాల్ జీ.. ఆప్ అవినీతిపర్వం.. ఇలాగే సాగుతుంటే.. ఎమ్మెల్యేలందరికి.. ఈ ఛీత్కార సత్కారాలు పరిపాటి అవుతాయనే విషయాన్ని గుర్తించుకోండి అని బీజేపీ నేతలు అన్నారు. ప్రధానంగా, వాయువ్య ఢిల్లీకి చెందిన మాజీ ఆప్ వలంటీర్ ద్వారా అక్రమ విక్రయాలు చేపట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. రాబోయే MCD ఎన్నికలకు AAP ఈ టిక్కెట్ల విక్రయ బాగోతం నిర్వహిస్తోందని అన్నారు. ఈ టికెట్ల విక్రయ ఘట్టాన్ని చిత్రీకరించిన స్టింగ్ వీడియోను బీజేపీ విడుదల చేసింది.

  ఆప్ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా వుందో ఈ వీడియో ద్వారా తెలుస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ఆప్ మటియాల ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ MCD ఎన్నికల టికెట్లు అమ్ముకుంటున్నారని సాక్షాత్ ఆ పార్టీ కార్యకర్తలే ఆరోపించారు. అవినీతి ఎమ్మెల్యే అని తూర్పాడ బడుతూ.. పార్టీ కార్యాలయం నుంచి ఆయన పరుగులు పెట్టేలా చేశారని.. ఈ దృశ్యాలన్నీ వీడియోలో వీక్షించామని షెహజాద్ పూనావాలా తెలిపారు. అయితే, ఆప్ పై ఈ తరహా ఆరోపణలు రావడం ఇదే ప్రథమం కాదని ఆయన అన్నారు. టిక్కెట్ల కోసం కార్యకర్తల నుంచి క్యాష్ కలెక్టర్లు నగదు వసూలు చేయడం ఇదివరలో చోటు చేసుకుందని చెప్పారు. ఇటీవల ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులు, బంధువులు అందరూ కలిసి 90 లక్షల రూపాయలకు టిక్కెట్లు అమ్మకాలు చేసినట్టు పూనావాలా ఆరోపించారు.

  రాజ్యసభ సీటు అయినా, ఇతర రాష్ట్రాల్లో టికెట్లయినా.. ఈ అవినీతి పర్వం సాగుతోందని, ఈ ఆరోపణలు సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి వచ్చాయని తెలిపారు. ఫోరం బయటే కాదు, పార్టీ ఫోరం లోపల సైతం అవినీతి ఇదేస్థాయిలో వుందని అన్నారు. ఢిల్లీ జల్ బోర్డ్ స్కామ్, లిక్కర్ పాలసీ స్కాం.. ఓహ్.. ఒకటేమిటి.. ఆప్ లూటీరా పార్టీ అని అభివర్ణించారు. కేజ్రీవాల్ ఈ ఎమ్మెల్యేను కట్టర్ ఇమాందార్ అని పిలుస్తారా..? అని విమర్శించారు. అయితే, ఎన్నికల టికెట్ల అమ్మకం ఆరోపణలను ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఖండించారు. బీజేపీ నిరాధరమైన ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం చెందారు.

  Trending Stories

  Related Stories