More

    హస్తినలో పాగా వేసిన ఆమ్ ఆద్మీ.. మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ..!

    ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో 134 స్థానాల్లో గెలుపొంది మేయర్ సీటు దక్కించుకుంది.

    దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15ఏళ్ల బీజేపీ పాలనను ఆప్ ఊడ్చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్ (126)ను దాటి.. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మేయర్ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 వార్డులను దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఈ ఫలితాల్లో హస్తం పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. మరో 3 చోట్ల ఇతరులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్త కేజ్రీవాల్‌ హవా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఆప్ విజయం సాధించడంతో.. ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    దేశ రాజధానిలోని 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,349 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో మూడు పౌర సంస్థలు ఢిల్లీ కార్పొరేషన్‎గా ఏకీకృతం అయిన తర్వాత ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. 2017లో 270 మునిసిపల్ వార్డులలో 181 మునిసిపల్ వార్డులను బిజెపి గెలుచుకుంది. అయితే అప్పుడు ఆప్ 48 మాత్రమే సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ 30 స్థానాలతో మూడవ స్థానంలో నిలిచింది.

    Trending Stories

    Related Stories