More

    ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కిడ్నాప్

    గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థి కంచన్ జరివాలా కిడ్నాప్ అయ్యారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మంగళవారం నుండి అతడు కనిపించకుండా పోయాడని.. కుటుంబంతో సహా అదృశ్యమయ్యారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కంచన్ జరీవాలాను బీజేపీయే కిడ్నాప్ చేసిందని ఆయన ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ భయాందోళనకు గురవుతుందని, అందుకే ఆప్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని సిసోడియా అన్నారు. సూరత్(తూర్పు) నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంచన్, అతని కుటుంబం నిన్నటి నుంచి కనిపించకుండా పోయారని సిసోడియా తెలిపారు. నామినేషన్ పత్రాల పరిశీలనకు వెళ్లాడు. నామినేషన్ పరిశీలన ముగించుకుని కార్యాలయం నుంచి బయటకు వచ్చిన మరుక్షణం బీజేపీ గుండాలు అతడిని తీసుకెళ్లారని ఆరోపించారు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియడంలేదని.. ఇలా చేయడం సరికాదని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహరించడమేనని సిసోడియా ఆరోపించారు.

    Trending Stories

    Related Stories