More

    అడ్డంగా బుక్ అయిన ఆప్

    తమను మించిన గొప్ప పార్టీ లేదని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ అడ్డంగా దొరికిపోయింది. ఆ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆయనకు జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని స్పష్టంగా తెలిసిపోయింది. సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఇప్పటికే మంత్రికి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఆరోపణలపై తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు.

    తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు గదిలో మసాజ్ చేయించుకుంటున్న వీడియోను బీజేపీ విడుదల చేసింది. సత్యేంద్ర జైన్ అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. తీహార్ జైలులో జైన్‌కు ప్రత్యేక గౌరవం లభిస్తోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీలోని కోర్టులో పేర్కొంది. జైన్‌కు మసాజ్‌లు, ఫుట్ మసాజ్‌లు చేస్తున్నారని, కర్ఫ్యూ సమయాలను దాటి కూడా అతనికి ప్రత్యేక ఆహారాన్ని అందించారని ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు. హవాలా రాకెట్, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను మే 30వ తేదీన అరెస్టు చేసింది.

    Trending Stories

    Related Stories