National

స్పీడ్ బ్రేకర్ కట్టించిన ఆప్ ఎమ్మెల్యే.. పెద్ద ఎత్తున అనుచరులను పిలిపించి

భారతదేశ రాజధాని ఢిల్లీ ఓ వైపు కోవిడ్‌తో పోరాడుతూ.. లాక్‌డౌన్‌ను అధిగమించడానికి కష్టపడుతోంది. కానీ ఆప్ నాయకులు తమ “విజయాలు” చూపిస్తూ బహిరంగంగా పలు కార్యక్రమాలను నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. ఢిల్లీలోని మోతీ నగర్ (అసెంబ్లీ నియోజకవర్గం) కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే శివ చరణ్ గోయెల్ గురువారం నాడు కేజ్రీవాల్ ప్రభుత్వ మల్టీ టాస్కింగ్ సామర్ధ్యాలను ఢిల్లీ ప్రజలతో పంచుకున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోతీ నగర్‌లో స్పీడ్ బ్రేకర్‌ను నిర్మించే గొప్ప పనిని చేపట్టారని ప్రగల్భాలు పలికారు. కరోనా మహమ్మారిని నియంత్రించే సమయంలో కూడా మోతీ నగర్ ఫీదిలో స్పీడ్ బ్రేకర్‌ను నిర్మించే ఈ భారమైన పనిని కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తి చేయగలిగిందని.. అందుకు ఢిల్లీ ప్రజలు ఆనందంగా ఉన్నారని వెల్లడించారు.

ఎమ్మెల్యే ట్విట్టర్‌లో పంచుకున్న చిత్రాల ద్వారా ఈ చిన్న పని విషయమై ఎంత పెద్దున ప్రచారం చేశారో అర్థం చేసుకోవచ్చు. పార్టీ సభ్యులు, మద్దతుదారుల ఉత్సాహభరితమైన సమూహం మధ్య స్పీడ్ బ్రేకర్‌ను ప్రారంభించడం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ స్మారక విజయాన్ని జరుపుకునేందుకు, పారవశ్యమైన ఆప్ సభ్యులు సామాజిక దూర నియమాలను ఉల్లంఘించారు. కరోనాను కట్టడి చేయడానికి ఓ వైపు అధికారులు కష్టపడుతూ ఉంటే.. మరో వైపు ఇలా చిన్న చిన్న కార్య క్రమాలకే పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యే పంచుకున్న చిత్రాలను చూడగా.. ఎమ్మెల్యే తన ట్వీట్‌లో ‘స్పీడ్ బ్రేకర్’ ఫోటోను పెట్టలేదు. జనం ఎక్కువ ఉన్న ఫోటోలే అక్కడ ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం కరోనాను కట్టడి చేస్తుందనే ఆశను వదులుకున్న ఢిల్లీ ప్రజలు.. ఇప్పుడు ఇలా ఆప్ నాయకులు చేస్తున్న ప్రచార ఆర్భాటాలకు జన సమీకరణలకు మళ్లీ కరోనా మహమ్మారి ఎక్కడ ముంచుకొస్తుందో అని భయానికి గురవుతున్నారు. ఆప్ ఎమ్మెల్యే చేసిన పనికి నెటిజన్లు ఒకింత షాక్ వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కట్టడికి ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు:

ఇటీవలి కాలంలో ఢిల్లీ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాల పట్ల సుప్రీంకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ ఆసుపత్రుల్లో కరోనావైరస్ రోగులకు చికిత్స చేయడం, మృతదేహాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. సుమోటో విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు ఢిల్లీ పరిస్థితిని భయానక, భయంకరమైన మరియు దయనీయమైనదిగా పేర్కొంది. ఆసుపత్రులలో ప్రతిచోటా మృతదేహాలతో పేర్చబడిన వీడియోలు బయటకు వచ్చింది. రాజధానిలో కరోనా వైరస్ దుస్థితిపై ఢిల్లీ హైకోర్టు కూడా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని నిందించింది. ఢిల్లీలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేసులు పెరుగుతున్నాయని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ నగరాన్ని త్వరలోనే ‘దేశ కరోనా రాజధాని’గా మార్చవచ్చని విమర్శలు గుప్పించింది. మరో వైపు కరోనా కేసులు కాస్త తగ్గగానే అన్ లాక్ నిర్ణయాన్ని తీసుకున్నారు ఢిల్లీ సీఎం. ఈ నిర్ణయం తొందరపాటు చర్య అని పలువురు వైద్యులు, నిపుణులు హెచ్చరించారు కూడానూ..!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 5 =

Back to top button