ఆమిర్ ఖాన్ తల్లికి తీవ్ర గుండెపోటు

0
758

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ముంబయిలోని పంచగని నివాసంలో ఆమిర్ ఖాన్ కుటుంబం దీపావళి వేడుకల్లో ఉండగా, గుండెపోటుతో జీనత్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. వెంటనే ఆమెను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది.

జీనత్ ఆమిర్ ఖాన్ తో కలిసి పంచగని ఇంట్లో ఉన్నట్లు నివేదికలు సూచించాయి. అక్కడ ఆమెకు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత ఆమెను ముంబైకి తీసుకెళ్లారని చెబుతున్నారు. ఆమె ఆరోగ్యం విషమించినప్పటి నుండి ఆమిర్, అతని ఇతర కుటుంబ సభ్యులు ఆమెతో ఉన్నట్లు సమాచారం. నటుడి నుండి ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ లేదు. ఆమిర్ ఖాన్ దివంగత చిత్ర నిర్మాత తాహిర్ హుస్సేన్, జీనత్ ల కుమారుడు. ఆమిర్ కు ఫైసల్ ఖాన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. ఈ సంవత్సరం జూన్‌లో ఆమిర్ తన తల్లి పుట్టినరోజును నిర్వహించారు. ఆమిర్ మాజీ భార్య కిరణ్ రావు, వారి కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్ కూడా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. తల్లి గుండెపోటుకు గురైనప్పటి నుంచి ఆమిర్ ఖాన్ ఆసుపత్రిలోనే ఉన్నాడని జాతీయ మీడియా వెల్లడించింది.తల్లి ఆరోగ్య పరిస్థితిపై ఆమిర్ ఖాన్ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు.