More

    శ్రద్ధా వాకర్ నిందితుడి షాకింగ్ కామెంట్స్.. హీరోగా స్వర్గానికి వెళ్తానని విచారణలో వెల్లడి..!

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని రోహిణి ఆసుపత్రిలో దాదాపు రెండు గంటల పాటు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పూనావాలా నార్కో పరీక్ష పూర్తిగా విజయవంతమైందని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు. శ్రద్దా వాకర్ హత్య కేసును అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

    చాలాకాలంగా సహజీవనం చేస్తున్ర శ్రద్ధను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచాడు. ఆ తర్వాత రోజూ కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి అడవిలో పడేశాడు. మే 18న జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగు చూసింది. అఫ్తాబ్ అమీన్ పూనావాలకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు అధికారులు. శ్రద్ధను తాను చంపానని అఫ్తాబ్ అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే తాను ఇలా చేసినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అతని చెప్పాడని పేర్కొన్నారు.

    ఈ కేసులో నవంబర్ 12న అఫ్తాబ్‎ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి నవంబర్ 22న ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అనంతరం కస్టడీని మరో 13 రోజులు పొడిగించింది.

    Trending Stories

    Related Stories