Special Stories

బాలీవుడ్ తెరవెనుక విషం..!
యూఎస్ ఇంటలిజెన్స్ రహస్య హస్తం..!!

బాలీవుడ్.. అదో అందమైన ప్రపంచం. కానీ, ఈ అందమైన ప్రపంచం.. అంతే అందంగా.. అనుమానం రాకుండా.. విషం కక్కుతోంది. ప్రేక్షకుల మెదళ్లలోకి భారత వ్యతిరేక భావజాలాన్ని.. స్లోపాయిజన్ లా ఎక్కిస్తోంది. బాలీవుడ్ బిగ్ షాట్స్ అభీష్టానికి అనుగుణంగా.. ఒక నిర్దిష్టమైన ఎజెండాతో ఈ తంతు కొనసాగుతోంది. నానాటికీ పెచ్చరిల్లుతున్న ఈ విష సంస్కృతిపై.. ఎందరో విమర్శకుల నుంచి ఆరోపణలు ఎదుర్కుంటూనేవుంది. ఖాన్‎ల ఏలుబడిలో దశాబ్దాలుగా ఈ ఉన్మాదం కొనసాగుతోంది. అయితే, బాలీవుడ్‎ ఫ్యాక్టరీని నడిపిస్తున్నది అండర్ వరల్డ్ మాఫియా మాత్రమేనని ఇన్నాళ్లూ భావించాం. కానీ, అంతర్జాతీయ స్థాయిలో అంతకుమించి కుట్రలు జరుగుతున్నాయన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఖాన్ ఫ్యాక్టరీకి విదేశీ సినిమా నిర్మాణ సంస్థల అండదండలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, బాలీవుడ్ తెరవెనుక కుట్రలకు.. అమెరికా ఇంటలిజెన్స్ సంస్థలే స్క్రిప్టు అందిస్తున్నాయంటే.. భారత దేశంపై కుట్రలు ఏ రేంజిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా, విజయ్ పటేల్ అనే నెటిజన్ తన అధికారి ట్విట్టర్ అకౌంట్‎లో.. బాలీవుడ్ – యూఎస్ ఇంటలిజెన్స్ లింకులపై పక్కా ఆధారాలను పంచుకున్నాడు. CIA కంటే ముందున్న అమెరికా ఇంటలిజెన్స్ సంస్థ ‘ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్’కు చెందిన కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్‎ను పోస్ట్ చేశాడు. వీటిని పరిశీలిస్తే.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న బాలీవుడ్ చిత్రాలు.. ప్రేక్షకుల మెదళ్లలో ఎలా విషం నింపుతున్నది ఇట్టే అర్థమైపోతుంది. సినిమాను ప్రచార ఆయుధంగా మలుచుకుని.. ఎప్పటి నుంచో అమెరికా చేస్తున్న కుట్రలు అర్థమవుతాయి. సినిమా ఓ శక్తివంతమైన ప్రసార సాధనం అనేది కాదనలేని వాస్తవం. అందుకే, అమెరికా దానిని ప్రచార ఆయుధంగా మలుచుకుని.. ఇతర దేశాలపై విషయం చిమ్ముతుంది. సాంస్కృతిక హననానికి పాల్పడుతోంది. బయటపడిన అమెరికా ఇంటలిజెన్స్ సర్వీసెస్ పేపర్స్, వికిలీక్స్ డాక్యుమెంట్లు ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. 2007లో ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు యూకే వెళ్లారు. వారిలో ఒకరు అప్పటి యూరప్ వ్యవహారాల సీనియర్ అడ్వైజర్ ఫరా పండిత్ కాగా, మరొకరు జేర్డ్ కోహెన్. యూకేలో వీరు కొంతమందిని కలిసి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడానికి బాలీవుడ్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇంతకీ వారి ప్రణాళిక ఏంటో తెలుసా..? బాలీవుడ్ సినిమాల ద్వారా ముస్లింలను గొప్పగా చూపించడం. ముస్లింలు ఉగ్రవాదులు కారని.. సినిమాల ద్వారా ప్రచారం చేయడం. అదే వారి ప్రధాన లక్ష్యం.

ఇక్కడ, యూకే చర్చల్లో ప్రధాన భూమిక పోషించిన ఫరా పండిత్ గురించి ఓసారి చెప్పుకోవాలి. అమెరికా ఇంటలిజెన్స్ ఎజెండాను అమలు చేసేందుకు.. పకడ్బందీ ప్రణాళికను రూపొందించిన ఆమెకు.. తదనంతర కాలంలో యూఎస్ లో దక్కాల్సిన గౌరవమే దక్కింది. 2009లో ఒబామా సర్కార్ అధికారంలో వున్నప్పుడు.. అంతకుముందు వరకు లేని ఓ కొత్త పదవిని సృష్టించారు. అదే ‘Special Representative To Muslim Communities For Rhe US Department Of State’. ఆ పదవిని తొలిసారి ఫరా పండిత్ కు కట్టబెట్టింది ఒబామా సర్కార్. అప్పటి ‘యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్స్’ హిల్లరీ క్లింటన్ ఈ కొత్త పదవికి కర్త, కర్మ, క్రియ.

ఇక, అసలు విషయానికి వద్దాం.. 2007లో యూకే వెళ్లిన ఫరా పండిత్, జేర్డ్ కోహెన్ బ్రిటన్‎లోని లీసెస్టర్ తో పాటు.. ముస్లింలు ఎక్కువగా నివసించే పలు ప్రాంతాల్లో పర్యటించారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేకతను ప్రోత్సహించేలా బాలీవుడ్‎ను ఎలా వాడుకోవాలో మంతనాలు జరిపారు. వికీలీక్స్ విడుదల చేసిన ‘యూఎస్ ఎంబసీ కేబుల్’ డాక్యుమెంట్స్ ప్రకారం.. కొందరు బాలీవుడ్ నటులు, ఎగ్జిక్యూటివ్స్ యూఎస్ ఇంటలిజెన్స్ ఐడియాకు ఫిదా అయ్యారు. అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. హాలీవుడ్ మాదిరిగానే బాలీవుడ్ లోనూ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ మెసేజ్ ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేంందుకు ఉత్సాహం చూపించారు. మరోవిషయం ఏమిటంటే, హుమైరా అక్తర్ కూడా ఆనాటి చర్చల్లో పాలు పంచుకున్నారు. ఈమెకు బాలీవుడ్ తో పెద్దయెత్తున సత్సంబంధాలున్నాయి. ఇంకేముంది, చర్చలు సఫలమయ్యాయి. కార్యాచరణ ప్రారంభమైంది.

వికీలీక్స్ పత్రాలు రిలీజైన కొద్దిరోజులకే.. 2009లో కరన్ జోహార్ ధర్మా ప్రొడక్షన్ నుంచి ‘ఖుర్బాన్’ పేరిట తొలి విషగుళిక బాలీవుడ్ తెరపైకొచ్చింది. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నటించిన ఈ సినిమా స్క్రిప్ట్.. యూకే చర్చల్లోనే రెడీ అయ్యింది. అమెరికా అధికారులే ఈ సినిమాకు కథ వస్తువు అందించారు. అయితే, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఉగ్రవాదుల పట్ల సామాన్య ప్రజలకు సహజంగా ఉండే ఏహ్యభావాన్ని.. తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. అందుకే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇంటలిజెన్స్ ప్రణాళికలో భాగంగానే.. ఈ సినిమాకు హాలీవుడ్ అండగా నిలిచింది. డిస్నీ అనుబంధ సంస్థ UTV ‘ఖుర్బాన్’ మూవీని పంపిణీ చేసింది.

ఇక, సరిగ్గా ఓ ఏడాది తర్వాత ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ పేరుతో కరన్ జోహార్ మరో సినిమాను నిర్మించాడు. ‘ఖుర్బాన్’ చేదు అనుభవంతో ఈసారి జాగ్రత్తగా వ్యవహరించారు. థియేటర్లకు భారీగా ప్రేక్షకులను రప్పించేందుకు.. కరన్ జోహార్ ఈసారి ఫేమస్ యాక్టర్ ను ఎంచుకున్నాడు. షారూక్ ఖాన్ లీడ్ రోల్ పోషించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సూపర్ హిట్టయింది. దీనిని కూడా హాలీవుడ్ సంస్థే పంపిణీ చేసింది. భారత్ లో ఫాక్స్ స్టార్ స్టూడియోకు ఇది తొలి చిత్రం. 2010లో ఏకంగా వంద కోట్లు వెచ్చించి ఫాక్స్ స్టార్ ఈ సినిమా పంపిణీ హక్కులను కొనుగోలు చేసింది. అప్పటివరకు బాలీవుడ్‎లో అదే పెద్దమొత్తం. ఇక, పెద్ద హీరో కావడంతో ఊహించినట్టే సినిమా సూపర్ హిట్టయింది.

ఇక్కడ మనం ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా టైమ్‎లైన్‎ను ఓసారి గమనిస్తే.. మనకు కొన్ని చిత్రవిచిత్రాలు కనిపిస్తాయి. సినిమా రిలీజ్ కంటే ముందు.. అంటే, 2009లో సినిమా ప్రమోషన్‎లో భాగంగా షారూక్ ఖాన్ అమెరికా వెళ్లారు. అప్పుడు పేరులో ఖాన్ ఉన్నకారణంగా.. అతన్ని న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్ పోర్టులో రెండుగంటల పాటు ఆపేశారు. యూఎస్ ఏజెన్సీతో పనిచేస్తున్నప్పటికీ షారూక్ ఖాన్ ను ఆపేయడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇది కూడా ప్రణాళికలో భాగమే. సినిమా పబ్లిసిటీ స్టంట్ కోసం వేసిన ఓ ఎత్తుగడ అని చెప్పకతప్పదు. ఆ ప్లాన్ కూడా నిజంగానే వర్కవుటయింది. ప్రేక్షకులను భారీగా థియేటర్లకు రప్పించింది.

తమ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి.. యూఎస్ ఏజెన్సీ అల్లిన కపటనాటకాల సమాహారమే ఈ చిత్రవిచిత్ర సంఘటనలని భావించకతప్పదు. ఇలా మొత్తం బాలీవుడ్‎ వేదికగా దేశ వ్యతిక భావనల్ని పెంచిపోషించే ప్రయత్నం పెద్దయెత్తున జరుగుతోందనడానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. తరిచి చూస్తే ఇలాంటి ఘటనలు కోకొల్లలు. యూఎస్ ఇంటలిజెన్స్, వికీలీక్స్ పత్రాలు గమనిస్తే ఇలాంటివి చిత్రాలు చాలా కనిపిస్తాయి. ఆ విషయాలపై ఓ లోతుగా పరిశీలన చేద్దాం..

Related Articles

Leave a Reply

Your email address will not be published.

twenty − eighteen =

Back to top button