More

    పళనిస్వామిని క్షమించమని వేడుకున్న 2జీ ఏ రాజా

    ముఖ్యమంత్రి ఎడప్పాడి తల్లిని కించపరిచేలా ఏ రాజా వ్యాఖ్యలు చేశారు. చెన్నై చెపాక్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఏ రాజా.. ప‌ళ‌నిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధం కాని జంటకు పళనిస్వామి జన్మించారంటూ ఘాటు పదజాలాన్ని ప్రయోగించారు. పైగా ఆయన ప్రీ మెచ్యుర్డ్ బేబీగా పుట్టారని విమర్శించారు. పళనిస్వామి వ్యక్తిత్వం.. డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పులకు కూడా పనికి రాదంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నాయకులు మండిపడ్డారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏ రాజాపై కేసు నమోదు చేశారు.

    డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఏ రాజా.. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఎన్నికల ప్రచార తీవ్రత పెరుగోతంది. అధికార ఏఐఎడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఈ వాడి వేడి రాజకీయాలు హద్దు, అదుపు లేని అనుచిత వ్యాఖ్యల విసుర్లకి,, వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తున్నాయి..

    ఇక ఏ రాజా డీఎంకే అధినేత చెప్పుతో పళనిస్వామిని పోల్చడమే కాకుండా.. అతని మాతృమూర్తిని కూడా అనరాని మాటతో విమర్శించారు. దీంతో ముఖ్యమంత్రి పళనిస్వామిని ఆ అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయి. ఒక రోడ్ షోలో ఆయన కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ అనూహ్య పరిణామంతో ఏ రాజా తన తప్పును తెలుసుకుని.. క్షమాపణ చెప్పారు.

    ముఖ్యమంత్రి ఎడప్పాడి తల్లిని కించపరిచేలా ఏ రాజా వ్యాఖ్యలు చేశారు. చెన్నై చెపాక్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఏ రాజా.. ప‌ళ‌నిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధం కాని జంటకు పళనిస్వామి జన్మించారంటూ ఘాటు పదజాలాన్ని ప్రయోగించారు. పైగా ఆయన ప్రీ మెచ్యుర్డ్ బేబీగా పుట్టారని విమర్శించారు. పళనిస్వామి వ్యక్తిత్వం.. డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పులకు కూడా పనికి రాదంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నాయకులు మండిపడ్డారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏ రాజాపై కేసు నమోదు చేశారు.

    ఇవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పళనిస్వామి కన్నీరు పెట్టుకున్నారు. చెన్నై తిరువొత్తియూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన.. రాజా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తనపైనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మరణించిన తన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం డీఎంకే నేతల అసహనాన్ని సూచిస్తోందంటూ విమర్శించారు. దేవుడే వారికి సరైన శిక్ష విధిస్తారని చెప్పారు. పళనిస్వామి కన్నీరు పెట్టుకోవడం పట్ల ఏ రాజా స్పందించారు. ఆయనను బాధపెట్టడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రికి క్షమాపణ కోరుతున్నానని వివరణ ఇచ్చుకున్నారు.

    ఇకనైనా మీమీ రాజకీయాలకోసం వ్యక్తిగత దూషణలు ఆపండి అటు నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. నోరుజారి తీవ్ర వేదన కలిగించి.. తరువాత సింపుల్ గా సోరీ చెప్పడం సబబు కాదని.. అటువంటి ఆలోచన విధానం పార్టీకి కూడా తీవ్ర నష్టం వాటిల్లేలా చేయగలదని… తమిళనాడు ప్రజలు వివేకవంతులని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

    Trending Stories

    Related Stories