తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద కలకలం చెలరేగింది. ఆలయం ఎదురుగా ఐదేళ్ల బాలుడు కూర్చొని ఉండగా అతడిని ఓ మహిళ ఎత్తుకెళ్లింది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కిడ్నాప్‌కు గురైన బాలుడి పేరు గోవర్ధన్ అని, ఆ బాలుడి కుటుంబం తిరుపతి దామినీడలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాలుడి కిడ్నాప్‌పై అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ తిరుపతికి వెళ్లే ఏపీ03 జడ్ 0300 నంబరు ఆర్టీసీ బస్సు ఎక్కిందని పోలీసులు చెప్పారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.