National

అమర్ నాథ్ యాత్రలో ప్రకృతి విధ్వంసం.. ప్రమాదంలో భక్తులు

అమర్ నాథ్ యాత్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షంతో కారణంగా ఊహించని విధంగా వరద పోటెత్తింది. వందలాది మంది చనిపోయి ఉంటారని అనుమానం. ప్రమాద స్థలానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నాయి. అమరనాథ్ గుహ ఉన్న ప్రాంతంలో ఊహించని విధంగా భారీ వర్షం కురియడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో అక్కడ భక్తులు వేసుకున్న టెంట్లు కూడా కొట్టుకుని పోయాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున భక్తులు కనిపించకుండా పోయే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం ఘటనా స్థలంలో ఉండి భక్తులను రక్షిస్తూ ఉన్నారు. అమర్ నాథ్ దేవాలయానికి అతి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా నిమిషాల వ్యవధిలో పెద్ద ఎత్తున వరద నీరు కొండల ప్రాంతం నుండి కిందకు వచ్చి చేరింది. దీంతో టెంట్స్, లంగర్ ప్రాంతంలోకి నీరు వచ్చి చేరాయి. ప్రస్తుతానికి కొందరు భక్తులు మిస్సింగ్ అనే వార్తలు వస్తున్నాయి. 17:30 గంటల సమయంలో దిగువ పవిత్ర గుహ (అమర్‌నాథ్) వద్ద క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో గుహ పై నుంచి, ప్రక్కల నుంచి నీరు వచ్చింది. ప్రస్తుతానికి వర్షం ఆగిపోయిందని చెబుతున్నారు.

Related Articles

Back to top button