Telugu States

హైదరాబాద్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రేమ జంట ఆత్మహత్య

హైదరాబాద్‌ లో 14 ఏళ్ల వయసున్న బాలుడు, బాలిక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్ కు చెందిన పూజ (14) సురేందర్ (14)లు ఇద్దరు ప్రేమించుకున్నారు. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకోగా.. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అంతేకాకుండా.. తల్లిదండ్రులు మందలించారు. దీంతో సూసైడ్ చేసుకుంది ఈ జంట. పేట్ బషీరాబాద్ ఫాక్స్ సాగర్ లో దూకి ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. పూజ, సురేందర్ మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌ మార్టంకు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button