మన మొబైల్స్ – మన తయారీ

0
797

భారత్ గర్వించదగ్గ ఎన్నో విషయాలు ఇటీవల కనిపిస్తున్నాయి. దేశంలో ఉపయోగిస్తున్న 97 శాతం మొబైల్ ఫోన్ లు భారత దేశంలోనే తయారయ్యాయి. ఔనా..అని ఆశ్చర్యం వ్యక్తం చేసినా, అహా..అని వెటకారం చేసినా.. ఇది అసలు సిసలు నిజం. అక్షర సత్యం. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్ల పై విస్పష్టమైన వివరణ ఇచ్చారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) నిర్వహించిన CyFY2022 కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. గతంలో భారతదేశంలో ఉపయోగించే మొబైల్ ఫోన్‌లలో 92 శాతానికి పైగా దిగుమతి అయ్యాయి. అయితే, ప్రస్తుతం భారతదేశంలో వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లలో 97 శాతానికి పైబడి ఫోన్లు స్వదేశంలో తయారైనవే. ఇప్పుడు 12 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ భాగాలను భారతదేశం ఎగుమతి చేస్తోందని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ చెప్పారు.

పాస్ట్ అండ్ ప్రెజంట్ సిట్యుయేషన్ లను గమనిస్తే..ఇదివరలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉండేది. ఆహార పదార్థాలే కాకుండా, దాదాపు అన్నింటిపైనా గతంలో ప్రపంచంలోని విస్తృత దేశాలపై ఆధారపడ్డాం. మొబైల్ ఫోన్ల విషయంలో సైతం ఇందుకు మినహాయింపు లేకుండా…ఫారెన్ కంట్రీస్ పై పారసైట్ గానే వున్నాం. తొలుత మనం విదేశాల నుంచి హ్యాండ్‌సెట్‌లను దిగుమతి చేసుకుని, మన అవసరాలను తీర్చుకున్నాం. అయితే, ఇప్పుడు భారతదేశం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. భారత్ తయారీ మొబైల్ ఫోన్‌లు ఇప్పుడు రికార్డు స్థాయిలో ఎగుమతి అవుతున్నాయి.

అభివృద్ధి గణాంకాలను పరిశీలిస్తే..భారతదేశం నెలవారీ మొబైల్ ఫోన్ ఎగుమతుల సంఖ్య మొదటిసారిగా బిలియన్ డాలర్లు దాటిందని ఇటీవల ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. డేటా ప్రకారం, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2021 వరకు మొబైల్ ఫోన్ షిప్‌మెంట్‌లు, వాటి స్కోర్‌లను 1.7 బిలియన్ డాలర్ల నుంచి 4.2 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేశాయి.

వర్కీజ్ వర్షిప్, ఎడోరేషన్ ఆఫ్ వర్క్ లీడ్స్ అస్ హ్యాపీ లైఫ్…ఇవి అందరు వల్లెవేసే మాటలే. అయితే, ఆచరణలో త్రికరణశుద్ధిగా పాటించి..అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తూ, అందరికీ హ్యాపీ కల్గిస్తున్నది మోదీ ప్రభుత్వం. అందుకే భారత్ సర్కారు ఆదర్శనీయంగా, అనుసరణీయంగా నిలుస్తోంది. కేంద్ర సర్కారు నిరంతర అభివృద్ధి చర్యల వల్ల ఈ ఉత్తమ ఫలితాలు లభిస్తున్నాయి. కేంద్ర సర్కార్ PLI స్కీం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇంతకుముందు మనం మొబైల్ ఫోన్‌లను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునేవాళ్ళం. విదేశాల నుంచి వస్తువులను ఆర్డర్ చేయడానికి డాలర్లు వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు మనం స్వావలంబన కలిగిన దేశంగా మారడం ఎంతో శుభపరిణామం.

కేంద్ర సర్కారు మేక్ ఇన్ ఇండియా విధానాన్ని తీసుకొచ్చి, కొన్ని విధి విధానాలను రూపొందించింది. తమ వస్తువులను భారత్‌లో విక్రయించాలనుకుంటే, అది భారతీయ ఉత్పత్తిగానే ఉండాలని విదేశీ కంపెనీలకు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో, ప్రపంచంలోని అతిపెద్ద హ్యాండ్‌సెట్‌ల మార్కెట్‌లో తమ స్టోర్‌లను తెరిచే అనేక కంపెనీలలో ఈ విధానం కన్పిస్తోంది. మొబైల్ ఫోన్లు చౌకగా లభించడం, విదేశీ నిల్వలపై భారం తగ్గడం..ఇలా ఎన్నో ప్రజోపయోగకర పనులు కేంద్రం సాహసోపేత, సమర్థవంత నిర్ణయాల వల్ల జరుగుతున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

12 + six =