కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతిలోని అంతర్‌గంగ గ్రామంలో ‘విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)’ కార్యకర్తల సమక్షంలో క్రైస్తవ కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తిరిగి హిందూ మతంలోకి మారారు. ఈ 9 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు. 55 ఏళ్ల జయశీలన్ తమిళనాడుకు చెందినవాడు, అయితే తన పూర్వీకులు 7 దశాబ్దాల క్రితం కర్ణాటకలోని భద్రావతిలో స్థిరపడ్డారని చెప్పారు. వృత్తిరీత్యా టైలర్ అయినా జయశీలన్ మాట్లాడుతూ తన తండ్రి ఏలుమలై దిన కూలీ అని. వారు గనిలో కూలీలుగా పనిచేసేవారని తెలిపాడు.

కొందరి కారణంగా తన తండ్రి 40 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతంలోకి మారాడని.. కానీ ఇప్పుడు తమ కుటుంబం తిరిగి హిందూ మతంలోకి రావాలని నిర్ణయించుకుందని అన్నారు. ఆదివారం (డిసెంబర్ 26, 2021) హిందూమతంలోకి తిరిగి వచ్చారు. తన తండ్రి క్రైస్తవ మతంలోకి మారనప్పుడే తాను పుట్టానని జయశీలన్ చెప్పారు. తన చిన్నతనంలో హిందూ మతంలోనే ఉన్నానని తెలిపాడు. ఇప్పుడు అధికారికంగా హిందూ మతంలోకి ప్రవేశించాడు.

జయశీలన్ మాట్లాడుతూ ‘నా తండ్రి నా ఇద్దరు కుమారుల పేర్లను క్రైస్తవులుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ, 10 సంవత్సరాల క్రితం, మా నాన్న మరణించారు. అప్పటి నుండి, మేము హిందూ మతాన్ని అనుసరించడం ప్రారంభించాము. అయితే, అప్పటికి తాము హిందూమతంలోకి తిరిగి రావడానికి వేదిక కనుగొనబడలేదు. ఇప్పుడు భద్రావతిలోని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మిత్రులను సంప్రదించాను. కార్యక్రమంలో భద్రావతి వీహెచ్‌పీ నేత హెచ్ రంప పాల్గొన్నారు. తిరిగి హిందూ ధర్మాన్ని అనుసరిస్తుండడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. ఇందుకు నేతలకు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు జయశీలన్. దేశ వ్యాప్తంగా ఎంతో మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరిస్తూ ఉన్నారు.