గురువారం మాల్దీవుల రాజధాని మాలేలో విదేశీ కార్మికులు ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో కనీసం తొమ్మిది మంది భారతీయులు మరణించారని.. పలువురు గాయపడినట్లు AFP నివేదించింది. మంటల్లో ధ్వంసమైన భవనం పై అంతస్తు నుంచి మొత్తం 10 మృతదేహాలను వెలికితీశారు. గ్రౌండ్ ఫ్లోర్ వెహికల్ రిపేర్ గ్యారేజీ నుంచి మంటలు చెలరేగాయని నివేదిక పేర్కొంది.
“మేము 10 మృతదేహాలను కనుగొన్నాము,” అని అగ్నిమాపక అధికారి AFP కి చెప్పారు. మంటలను ఆర్పడానికి తమకు నాలుగు గంటలు పట్టిందని వారు వెల్లడించారు. ఈ ఘటనపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేసింది. వారు మాల్దీవుల అధికారులతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు. ఓ భవనంలో చెలరేగిన మంటల్లో ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు కాగా, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. ఉపాధి కోసం అక్కడకు వెళ్లిన చాలా మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో విదేశీ కార్మికుల జీవన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఎంతో దుర్భరమైన జీవితాలను వాళ్లు గడుపుతూ ఉన్నారు.