More

    కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు

    కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలపక్కడ్‌లో విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు. ఎర్నాకుళం జిల్లా మూలంతురుతిలోని ఓ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు.. ఓ టూరిస్ట్ బస్సులో ఊటీకి విహార యాత్రకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత వేగంగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు, కేరళ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన టూరిస్టు బస్సు రోడ్డుపక్కన ఉన్న కాల్వలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఓ టీచర్‌, ఆర్టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు వెల్లడించారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

    Trending Stories

    Related Stories