More

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాత్రికుల్లో 84 మంది సురక్షితం

    అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాత్రికుల్లో 84 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళల ఆచూకీ తెలియాల్సి ఉంది. అంతకు ముందు ప్రభుత్వం ఏపీకి చెందిన ఐదుగురు యాత్రికుల సమాచారం తెలియలేదని వెల్లడించింది. అయితే, వీరిలో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. ఏపీకి చెందిన భక్తులకు సహాయం చేసేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారిని శ్రీనగర్ పంపించారు. భక్తుల సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం 1902 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమర్‌నాథ్‌ యాత్రలో సురక్షితంగా ఉన్న ఏపీ వాసులను అధికారులు సంప్రదించారు. ఏపీలోని రాజమహేంద్ర వరం నుంచి 20 మంది యాత్రికుల బృందం అమర్‌నాథ్‌ వెళ్లింది. ఈ బృందానికి చెందిన ఇద్దరు మహిళల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. . గుంటూరు నుంచి వెళ్లిన 38 మంది భక్తుల బృందం, తాడేపల్లి గూడెం నుంచి వెళ్లిన 17 మంది బృందం, తిరుపతి నుంచి వెళ్లిన ఆరుగురు భక్తుల బృందం, ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన మరికొంత మంది సురక్షితంగా ఉన్నారు.

    అమర్‌నాథ్‌లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరద కారణంగా 17 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories