ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

0
893

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 8 మంది మ‌ర‌ణించ‌గా.. ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సిద్ధార్థ్‌న‌గ‌ర్ జిల్లాలోని జోగియా కొత్వాలి ప్రాంతంలోని నౌగర్ బన్నీ రోడ్డులో ఉన్న కాత్యా గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్ర‌క్కును బొలేరో వాహ‌నం ఢీ కొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో బొలెరో వాహ‌నంలో 11 మంది ఉండ‌గా.. వీరిలో 8 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని.. క్ష‌తగాత్రుల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరంతా అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రై తిరిగి వెలుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మితిమీరిన వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్ష‌త‌గాత్రులంద‌రికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారుల‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాల‌కు రూ.2ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన రూ.50వేలు చొప్పున అందించ‌నున్నారు.