బస్సులో మంటలు.. బతుకులు బుగ్గిపాలు..!

0
732

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కలబురిగిలోని కమలాపురం వద్ద ఆగి ఉన్న మినీ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రయాణికులు మృతిచెందారు.

జీపును ఢీకొట్టిన అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అందులోని ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాద సమయానికి బస్సులో డ్రైవర్తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మందిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

బీదర్-శ్రీరంగపట్టణం జాతీయరహదారిపై కమలాపుర వద్ద శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తోంది. మృతులంతా హైదరాబాద్ కు చెందినవారేనని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మినీ లారీనీ ఢీకొట్టిన తర్వాత బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here