National

కరోనాతో చనిపోయిందనుకుని.. అంతిమ సంస్కారాలు నిర్వహించబోతుండగా..!

76 సంవత్సరాల వృద్ధురాలు.. కరోనాతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించడానికి కుటుంబ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ వచ్చారు. ఇంకొద్ది క్షణాల్లో ఆమెను పూడ్చబోతూ ఉన్నారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఆమె లేచి కూర్చుంది. దీంతో కుటుంబ సభ్యులంతా అవాక్కయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర లోని బారామతి ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇలా లేచి కూర్చున్న వృద్ధురాలిని ముధాలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ గా గుర్తించారు. 76 సంవత్సరాల శంకుతలకు కొద్దిరోజుల కిందట కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఆమె వయసు రీత్యా ఆసుపత్రిలో చేర్పించాలని కుటుంబ సభ్యులు భావించారు. మే 10వ తేదీన ప్రైవేట్ వాహనంలో ఆమెను బారామతిలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. కానీ అక్కడ ఆమెకు బెడ్ దొరకలేదు. కొద్దిసేపు ఎదురుచూశారు. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కనీసం కదలడం లేదు..! దీంతో ఆమె చనిపోయిందని అనుకున్నారు. ఆమెను తిరిగి సొంత గ్రామానికి తీసుకుని వచ్చారు. శకుంతల గైక్వాడ్ చనిపోయిందనే విషయాన్ని చుట్టుపక్కల వాళ్లకు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆమె చనిపోయిందన్న బాధతో కుటుంబం మొత్తం ఉండిపోయింది.
ఇక ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేయడం మొదలు పెట్టారు. ఇంకొద్ది క్షణాల్లో అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని అనుకుంటున్నా సమయంలో శకుంతల గైక్వాడ్ గట్టిగా ఏడవడం మొదలు పెట్టి.. కళ్లు తెరచింది. దీంతో కుటుంబ సభ్యులకు షాక్ అవ్వాలో.. ఆనందపడాలో తెలియని పరిస్థితి. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు బారామతి లోని సిల్వర్ జూబ్లీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను స్థానిక పోలీసులు కూడా ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + 11 =

Back to top button