నిబంధనలకు నీళ్ళు – టూరిస్ట్ వీసాలతో మతపర కార్యక్రమాలు

0
684

హైందవ జాతి మంచితనం అన్యమతస్థులుకు అలుసుగా కనిపిస్తుందో ఏమో తెలియదుకాని…అటు ఇస్లామిస్టులు, ఇటు మిషనరీస్టులు..హిందువులను ఇబ్బందులకు గురిచేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఎన్ని అకృత్యాలు, దారుణకృత్యాలు చేసినా..భూదేవి అంత ఓర్పుతో హిందువులు భరిస్తున్నారు. ఒక్కసారి హిందువులు కన్నెర్ర చేస్తే…ఈ గ్యాంగ్ లన్నీ పత్తా లేకుండా పోతాయి. అయినా, మంచి, మానవత్వమే శ్రీరామ రక్షగా హిందువులు ముందుకు సాగుతున్నారు. అస్సాంలో ..మిషనరీ మత బోధకులు..వీసా నిబంధనలను తుంగలోకి తొక్కేసి మతపర సమావేశాలకు హాజరవుతున్నారు. బలవంతపు మతమార్పిడిలకు పాల్పడుతున్నారు. దీంతో, పోలీసులు వీరి ఆట కట్టించారు. అధికారులు వీరికి భారీ ఎత్తున జరిమానాలు విధించి, బహిష్కరణ వేటు వేశారు.

అస్సాంలో..అమాయక ప్రజలను బలవంతంగా అన్యమతంలోకి మార్చడానికి కొందరు దుష్టప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకించి, టీ గార్డెన్స్ ఏరియా ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇందు కోసం ఉద్దేశించిన పలు మత పర సమావేశాలకు ఏడుగురు జర్మన్ మిషనరీలు హాజరయ్యారు. తిన్సుకియా, గోలాఘాట్, కర్బీ, అంగ్లాంగ్ జిల్లాల్లో పర్యాటక వీసాలపై వచ్చిన నిందితులు, ఈ బలవంతపు మత మార్పిడిలకు పాల్పడుతున్నారు. వీసా నిబంధనలు ఉల్లంఘించి, ఈ సమావేశాలకు హాజరైన ఏడుగురు జర్మన్ మిషనరీ మెంబర్లను కాజిరంగలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారం వ్యవధిలో ఈ తరహా కేసు నమోదవ్వడం ఇది రెండోసారి. వీసా నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు స్వీడిష్ బోధకులు అక్టోబర్ 26న డిబ్రూఘర్‌లో అరెస్టవ్వగా, ఇప్పడు ఏడుగురు ఈ దుశ్చర్యకు పాల్పడి పోలీసులకు చిక్కారు.

నిర్బంధంలో ఉన్న జర్మన్ మిషనరీలు టిన్సుకియా, గోలాఘాట్, కర్బీ అంగ్లాంగ్ జిల్లాల్లో జరిగిన మతపరమైన సమావేశాలకు హాజరయ్యారని ప్రత్యేక డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. తేజ్‌పూర్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని నిందితులు ప్రయత్నిస్తుండగా, పట్టుబడ్డారని సింగ్ చెప్పారు. టూరిస్ట్ వీసాలపై వచ్చి..M 1 వీసాలు వున్నట్టు భ్రమ కల్పించారని అన్నారు. తొలుత వీరు చర్చి అసోసియేషన్ కార్యక్రమానికి హాజరై ఈ ప్రణాళిక రూపొందించినట్టు తెలిసిందని చెప్పారు. మతపరమైన కార్యక్రమాలకు హాజరవడం, చర్చి సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రసంగాలు చేయడం ద్వారా వీసా నిబంధనలను ఉల్లంఘించారని అన్నారు.

జార్ఖండ్‌కు చెందిన భారతీయ క్రైస్తవ బోధకుడితో కలిసి ఏడుగురు జర్మన్ మిషనరీలు ఇక్కడకు వచ్చినట్టు సమాచారం. అస్సాంకు చెందిన తెరాంగ్ అనే స్థానిక క్రైస్తవ బోధకుడు వీరిని ఆహ్వానించినట్టు తెలిసింది. ఉద్దేశపూర్వకంగా వీసా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో భారత బోధకులపైనా కేసు నమోదు చేస్తామని ప్రత్యేక డీజీపీ సింగ్ తెలిపారు. అయితే, జరిమానాలు, టూరిస్ట వీసాల పరిశీలన..తదితర చర్యలు పూర్తయ్యాక…అదుపులోకి తీసుకున్న జర్మన్ మిషనరీలను కోల్‌కతా నుంచి జర్మనీకి తిరిగి పంపిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

18 + eighteen =