More

    జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన.. అవార్డులు దక్కింది ఎవరికంటే

    68వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2021-22కిగానూ అవార్డులను విడుదల చేశారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం అవార్డులను వెల్లడించింది. ఐదు కేటగిరిలో నేషనల్‌ అవార్డులను ప్రకటించారు. ఇందులో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఫీచర్‌ ఫిల్మ్, నాన్‌ఫీచర్‌ఫిల్మ్, బెస్ట్ రైటింగ్‌, బెస్ట్ ఫ్రెండ్లీ స్టేట్‌ అనే కేటగిరిలో అవార్డులను అందిస్తున్నట్టు అవార్డు కమిటీ వెల్లడించింది. ఇందులో ఫ్రెండ్లీ స్టేట్‌ అవార్డుల్లో మధ్య ప్రదేశ్‌ నిలిచింది.

    ఫీచర్‌ ఫిల్మ్స్ లో 30 భాషలకు చెందిన 305 సినిమాలు అవార్డులకు పోటీ పడ్డాయని తెలిపారు. జ్యూరి చైర్మెన్‌ విపుల్‌ అమృతలాల్‌ షా సారథ్యంలోని జ్యూరి ఫీచర్ ఫిల్మ్స్ ని ప్రకటించారు. ఫీచర్‌ ఫిల్మ్స్ లో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫోటో నిలిచింది. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్‌ఎస్‌ థమన్‌ (అలా వైకుంఠపురములో) చిత్రానికి గానూ అవార్డుని అందుకున్నారు. మేకప్‌ ఆర్టిస్ట్ విభాగంలో నాట్యం చిత్రానికి పనిచేసిన టీవీ రాంబాబుకి అవార్డు దక్కింది.

    ఉత్తమ నటుడుః సూర్య(సూరారై పోట్రు), అజయ్‌ దేవగన్‌(తానాజీ).

    ఉత్తమ నటిః అపర్ణ బాలమురళి(సూరారై పోట్రు)

    ఉత్తమ సహాయ నటుడుః బీజూ మీనన్‌(అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌)

    ఉత్తమ సహాయ నటిః లక్ష్మీ ప్రియా చంద్రమౌళి(శివ రంజినీయుము ఇన్నుమ్‌ సిలా పెంగలుమ్‌)

    నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ కుటుంబ చిత్రంగా ‘కుంకుం అర్చన్‌’

    నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ ఫిక్షన్ స్టోరీ చిత్రం కచ్చి చినుకు (అసోం)

    అడ్మిటెడ్‌ సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు

    ఫిల్మ్‌ ఫ్రెండ్లీ రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌

    ఉత్తమ తెలుగు కథా చిత్రంగా ‘కలర్‌ ఫొటో’

    ‘నాట్యం’ చిత్రానికి 2 జాతీయ అవార్డులు.. బెస్ట్‌ కొరియాగ్రఫీ, బెస్ట్‌ మేకప్‌ విభాగాల్లో ‘నాట్యం’కు అవార్డులు

    ఉత్తమ సంగీత దర్శకుడు తమన్‌ (అల వైకుంఠపురం)

    2020 ఏడాదికి ఉత్తమ చిత్రం సూరారాయ్‌ పోట్రు

    ఈ ఏడాది బెస్ట్ క్రిటిక్‌ అవార్డు ఎవరికీ ఇవ్వడం లేదని కేంద్రం ప్రకటించింది

    spot_img

    Trending Stories

    Related Stories