పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లా భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం ఓ డ్రోన్‌ను కూల్చివేశాయి. బీఎస్ఎఫ్ దళాలు, అమృత్సర్ పోలీసులతో కూడిన జాయింట్ పెట్రోలింగ్ పార్టీ డ్రోన్‌ను గుర్తించి కాల్పులు జరిపి నేలమట్టం చేశారు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆదివారం భద్రతా దళాలు ఆరు రెక్కల డ్రోన్‌ను కాల్చివేసి, 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
పంజాబ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 4 గంటలకు సరిహద్దు భద్రతా దళం (BSF), అమృత్సర్ పోలీసుల సంయుక్త పెట్రోలింగ్ బృందం డ్రోన్ శబ్దాన్ని విని కక్కర్ గ్రామంలోని లోపోక్ ప్రాంతంలోకి చేరుకున్నారు. అక్కడ డ్రోన్ ద్వారా తరలిస్తున్న 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ను అమెరికా, చైనాలో తయారు చేసినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు. “AK-47 తో మొత్తం 12 రౌండ్ల కాల్పులు జరిపి డ్రోన్ ను కూల్చి వేశాం. ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశాం. ఈ డ్రోన్ USA, చైనాలో తయారు చేశారు” అని తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లోని కౌర్ ఏరియాలో అనుమానాస్పద బెలూన్ను పోలీసులు ఆదివారం నాడు స్వాధీనం చేసుకున్నారు. విమానం ఆకారంలో ఉన్న ఈ బెలూన్‌పై ‘పీఐఏ’ (PIA) అని రాసి ఉంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ని పీఐఏ అని అంటారు.